Jayashankar Bhupalapally : ఆదర్శంగా నిలిచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా..

X
By - Sai Gnan |4 Oct 2022 8:47 PM IST
Jayashankar Bhupalapally : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య.. ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏరియా ఆసుపత్రిలో ప్రసవించారు
Collector Bhavesh Mishra : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య.. ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏరియా ఆసుపత్రిలో ప్రసవించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలవరీ జరుపుకుని ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ దంపతులను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.
భూపాలపల్లిలోని మాతా శిశు సంరక్ష కేంద్రాన్ని సందర్శించిన మంత్రి.. నూతన శిశువును, ఇలా త్రిపాఠిని పలకరించారు. ప్రజల్లో విశ్వాసం నింపడానికే కలెక్టర్ దంపతులు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపిక చేసుకోవడం ప్రశంసనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com