తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ..!

తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ..!
తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి... సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం సీఎల్పీ ఆఫీసులో కాంగ్రెస్‌ నేతలతో ముచ్చటించిన ఆయన... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి... సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం సీఎల్పీ ఆఫీసులో కాంగ్రెస్‌ నేతలతో ముచ్చటించిన ఆయన... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖమంత్రి అయ్యాక... కేసీఆర్‌ను కలవలేదని.. అందుకే ఇప్పుడు కలిశానని అన్నారు. రాయలసీమ కూడా తెలంగాణలో కలిసి ఉంటే బాగుండేదని కేసీఆర్‌ చెప్పినట్లు జేసీ వ్యాఖ్యానించారు. ఆంధ్రాను వదిలేసి తెలంగాణకు వస్తానని... తెలంగాణను వదిలిపెట్ట నష్టపోయామని... రాయల తెలంగాణ కావాలని జైపాల్‌ రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదని కాంగ్రెస్‌ నేతలతో జేసీ వ్యాఖ్యానిచారు. ఇక హుజురాబాద్‌ కోసం తనకు తెలియదని... కానీ జానారెడ్డి ఓడిపోతారని ముందే చెప్పాన్నారు. ఆయన ఓటమికి కారణం అందరికీ తెలుసన్నారు. దీంతో జేసీ మాటలను అడ్డుకున్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. సీఎల్పీలో ఇష్టంవచ్చినట్లు మాట్లాడొద్దని... కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరిగేలా సీఎల్పీలో మాట్లాడకూడదని అడ్డుకున్నారు. ఏదైన వ్యతిరేకంగా మాట్లాడాలంటే బయట మాట్లాడాలని జేసీకి జీవన్‌ రెడ్డి సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story