JP Nadda: త్వరలో కేసీఆర్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం: నడ్డా

JP Nadda: త్వరలో కేసీఆర్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం: నడ్డా
JP Nadda: కేసీఆర్‌ను ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

JP Nadda: కేసీఆర్‌ను ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. త్వరలో కేసీఆర్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం, ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడం ఖాయమన్నారు. కేసీఆర్‌ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు నడ్డా. చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా కేసీఆర్‌ లాగే ఆంక్షలే విధించేవారన్నారు

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఫైర్‌ అయ్యారు జేపీ నడ్డా. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ కుటుంబం ఏటీఎంగా మార్చుకుందన్నారు. రూ.40వేల కోట్ల ఈ ప్రాజెక్టు లక్షా 40వేల కోట్లకు పెంచారంటే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతోంది. జల్‌జీవన్ మిషన్‌ కింద రూ.3,500 కోట్లు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తామన్నారు జేపీ నడ్డా. పాదయాత్ర చేయకుండా బండి సంజయ్‌ను అడ్డుకోవాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఓ రోజు ముందు అనుమతి రద్దు చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతి పొందామన్నారు జేపీ నడ్డా. దుబ్బాక, హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు చుక్కలు చూపించామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story