Telanga Bjp :తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో పాగా వేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తూ హీటు పెంచుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు రానున్నారు. నాగర్ కర్నూల్‌లోని జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అభియాన్ సే సంపర్క్ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు ముఖ్య నేతలను కలవనున్నారు. అనంతరం నోవాటెల్‌కు వెళ్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4గంటల 15 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా నాగర్‌కర్నూల్ సభకు వెళ్తారు. సభ ముగిసిన అనంతరం తిరువనంతపురం వెళ్లనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com