జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో విజేతలకు శుభాకాంక్షల వెల్లువ

జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో విజేతలకు శుభాకాంక్షల వెల్లువ
JHWS ప్యానల్ సభ్యులు ఘన విజయం సాధించడంతో సంబరాలు మిన్నంటాయి.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో JHWS ప్యానల్‌ విజయ దుందుభి మోగించింది. మొత్తం 15 మేనేజింగ్ కమిటీ మెంబర్‌ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎస్సీ, ఎస్టీ, మహిళ కేటగిరీలను గెల్చుకున్న JHWS ప్యానల్‌... ఓపెన్‌ కేటగిరీని కూడా కొల్లగొట్టేసింది. ఈ‌ కేటగిరీలో మొత్తం 27 మంది పోటీ చేయగా.. JHWS ప్యానల్‌ తరపున బరిలో నిలిచిన 12 మంది సభ్యులు తిరుగులేని విజయం సాధించారు. JHWS ప్యానల్‌ నుంచి పోటీ చేసిన టీవీ 5 ఎండీ బి. రవీంద్రనాథ్‌, ఎం. ఆనంద్‌ కుమార్‌, ఓం ప్రకాశ్‌ అగర్వాల్‌, కుసుమ్‌కుమార్‌ జెట్టి, గరికపాటి శ్రీనివాసు, పి.నాగరాజు, కె. నాగేంద్ర ప్రసాద్‌, వి.వి. రాజేంద్రప్రసాద్‌, మాదాడి శ్రీలక్ష్మి రెడ్డి, ఆర్‌. మాధవ రెడ్డి, ఎ. మురళీ ముకుంద్‌, ఎస్‌. సతీష్‌ చంద్రలు ఓపెన్ కేటగిరీలో తిరుగులేని విజయం సాధించింది.

మహిళల కేటగిరీలో JHWS ప్యానల్‌ అభ్యర్థులు జయకేతనం ఎగువేశారు. ఇందులో ఆదాల హిమబిందు రెడ్డి, సునీల రెడ్డి గెలుపొందారు. ఈ కేటగిరీలో మొత్తం నలుగురు పోటీ పడ్డారు. అయితే ఓటర్లు మాత్రం... JHWS ప్యానల్‌ వైపే మొగ్గు చూపారు. హిమబిందు రెడ్డికి 1125 ఓట్లు రాగా... సునీల రెడ్డికి 1077 ఓట్లు దక్కాయి. ఇక... ఎస్సీ ఎస్టీ కేటగిరీలో JHWS ప్యానల్‌ అభ్యర్థి సుజాత శీలం ఘన విజయం సాధించారు. ఈ కేటగిరీలో ఇద్దరు సభ్యులు పోటీ చేయగా... సొసైటీ సభ్యులు సుజాత శీలం వైపు మొగ్గు చూపారు. అనిల్‌ బొమ్మాజీకి 676 ఓట్లు రాగా... సుజాత శీలం కు 1021 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 345 ఓట్ల మెజార్టీతో JHWS ప్యానల్‌ అభ్యర్థి సుజాత శీలం విజయం సాధించారు.

జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో ఓట్ ఫర్ ఛేంజ్ అన్న నినాదం మారుమోగింది. గత మేనేజింగ్ కమిటీ నియంతృత్వం పై జూబ్లీహిల్స్ వెల్ఫేర్ సొసైటీ విజయం సాధించింది. 15 యేళ్ళుగా అసలు ఎన్నికలే లేకుండా చేసిన గత మేనేజింగ్ కమిటీకి, జూబ్లీ హిల్స్ సభ్యులకు దిమ్మతిరిగే గుణపాఠం చెప్పారు సొసైటీ సభ్యులు. గత దశాబ్దంన్నర పాటు సాగించిన ఏక ఛత్రాధిపత్యాన్ని JHWS ప్యానల్‌ బద్దలు కొట్టింది. ప్రజాస్వామ్య హంతకులు మాకొద్దు... ప్రజాస్వామ్య పరిరక్షకులే మాకు కావాలి అని ముక్తకంఠంతో నినదించారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి అపోజిషన్ సభ్యుల అడ్రస్ గల్లంతు చేశారు. దీంతో గెలుపు ఏకపక్షమే అయింది.

JHWS ప్యానల్ సభ్యులు ఘన విజయం సాధించడంతో సంబరాలు మిన్నంటాయి. తమపై అపారమైన నమ్మకంతో గెలిపించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ కోపారేటివ్ హౌస్ బిల్గింగ్ సొసైటీ అభివృద్దికి తమవంతు కృషిచేస్తామన్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో గెలుపొందిన వారిని పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ ప్రాంత అభివృద్దికి చిత్తశుద్దితో కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story