K Kavitha: అసోం సీఎం హిమంత బిశ్వకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్..

K Kavitha: అసోం సీఎం హిమంత బిశ్వకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని సీఎం హిమంత బిశ్వ శర్మ అనరాని మాటలు అంటుంటే.. రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీకి సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారని, అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని అన్నారు. ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారానే తెలంగాణ వచ్చింది గానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ పోరాటంలో ప్రజలంతా కేసీఆర్‌తో కలిసి రావడం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం వల్లే రాష్ట్రం ఇచ్చారు గానీ, అది ఎవరి భిక్ష కాదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com