TG: తెలంగాణ సీఎస్‌గా కె. రామకృష్ణారావు

తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త ప్రభుత్వ ప్రధాన క కార్యదర్శిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. ఈ పదవి కోసం రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని నిర్ణయించింది. తెలంగాణకు కేంద్ర నిధులు రాబట్టడంలో రామకృష్ణారావు కీలకంగా వ్యవహరించారు.
ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్
1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కే రామకృష్ణారావు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. ఐఐటీ కాన్పుర్‌లో బీటెక్, ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్, అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు.2013-14లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన ప్రక్రియలోనూ చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతూ రాగా.. తాజాగా ప్రభుత్వం ఆయనను సీఎస్‌గా నియమించింది. 12 సంవత్సరాల పాటు ఆర్థికశాఖలో కొనసాగుతూ వచ్చిన ఆయన.. 14 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లను తీర్చిదిద్దారు. ఇందులో 12 పూరిస్థాయి.. మరో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లను తీర్చిదిద్దారు.
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
మరోవైపు, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్ - శశాంక్ గోయల్
ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈవో- జయేశ్ రంజన్
పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శి- సంజయ్ కుమార్
ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ - స్మితాసబర్వాల్
కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - దానకిశోర్
పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి
పట్టణాభివృద్ధి కార్యదర్శి (హెచ్‌ఎండీఏ పరిధి) - ఇలంబర్తి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ - ఆర్వీ కర్ణన్
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ - కె.శశాంక
జెన్‌కో సీఎండీ - ఎస్‌హరీశ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com