KA Paul: నాకు పర్మిషన్ ఇవ్వకుండా రాహుల్ సభకు ఎలా ఇస్తారు: కే.ఏ.పాల్

X
KA Paul: రాహుల్‌గాంధీ సభకు ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే.ఏ.పాల్. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో మే 6వ తేదీన మీటింగ్ కోసం పర్మిషన్‌కు అప్లై చేస్తే.. పోలీసులు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. తనకు ఇవ్వని పర్మిషన్ రాహుల్ గాంధీ సభకు ఎలా ఇస్తారంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని ప్రశ్నించారు. రైతుల కోసం తానెక్కడ ఉద్యమం చేస్తానోనని కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ అవుతుందనుకుంటే కనీసం వెండి తెలంగాణ కూడా కాలేదని కామెంట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
