Munugode: డబ్బులతో ఓటర్లను కొంటున్న మూడు పార్టీలు..: కేఏ పాల్

Munugode: డబ్బులతో ఓటర్లను కొంటున్న మూడు పార్టీలు..: కేఏ పాల్
Munugode: మునుగోడులో మూడు పార్టీలు డబ్బులతో ఓటర్లను కొంటున్నారని ఇండిపెండెంట్ అభ్యర్థి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు ఆరోపించారు.

KA Paul: మునుగోడులో మూడు పార్టీలు డబ్బులతో ఓటర్లను కొంటున్నారని ఇండిపెండెంట్ అభ్యర్థి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు ఆరోపించారు. ఓ పార్టీ ఓటుకు 3 వేలు ఇస్తే.. మరో పార్టీ 3 వేలు, ఇంకో పార్టీ 15 వందల రూపాయలు పంచారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఈసీ డిస్‌ క్వాలిఫై చేసి మిగిలిన వారిని మాత్రమే అభ్యర్థులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న కేఏ పాల్‌



మునుగోడులోని ఓ ప్రాంతంలో గంప గుత్తగా ఓట్లు కొనుగోలు చేశారు ఓ పార్టీ నేత. ఓ వర్గం వారికి గుడి కట్టిస్తామి ఇచ్చారు ఆ పార్టీ నేతలు. ఈ మేరకు.. పేపర్లు రాసి ఇచ్చారు. ఉదయం నుంచి.. దీనిపై చర్చలు జరిగాయి. చివరికి మధ్యాహ్నానికి చర్చలు సఫలం కావడంతో.. ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం పూర్తైన తర్వాత.. పోలింగ్‌ బూత్‌కు గుంపుగా వచ్చారు ఓటర్లు.



నల్గొండ జిల్లా గట్టుప్పల మండలం రంగం తండాలో... ఎన్నికలను బహిష్కరించారు గ్రామస్థులు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని ఆందళనకు దిగారు. తమ సమస్యను చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీంతో నిరసన వ్యక్తం చేశారు గ్రామస్థులు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయబోమన్నారు. ఈ తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి.

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ పుంజుకుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైంది. 2,41,805 ఓట్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,44,878 ఓట్లు పోలయ్యాయి. ఐదు గంటలవరకు సమయం ఉండటంతో...ఓటింగ్‌ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. మునుగోడులో మొత్తం ప్రస్తుతం దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది.

ఇక... నల్గొండ జిల్లా గట్టుప్పల మండలం రంగం తండాలో... ఎన్నికలను బహిష్కరించారు గ్రామస్థులు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని ఆందళనకు దిగారు. తమ సమస్యను చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీంతో నిరసన వ్యక్తం చేశారు గ్రామస్థులు.


తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయబోమన్నారు. ఈ తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి. దీంతో.. మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు టీఆర్‌ఎస్‌ నేతలు. అయితే... ముందుగా పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని... త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story