Kadiyam Sreehari: వైఎస్‌ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే

Kadiyam Sreehari: వైఎస్‌ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమే
X
సమైక్యాంధ్రానే తమ నినాదం అని చెప్పి ఊరువాడ తిరిగిన వ్యక్తి షర్మిల

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు, వైఎస్‌ షర్మిలపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పాదయాత్ర చేస్తూ శక్తి, సమయాన్ని వృధా చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్రానే తమ నినాదం అని చెప్పి ఊరువాడ తిరిగిన వ్యక్తి షర్మిల అని చెప్పారు. వైఎస్‌ కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమన్నారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడుగడుగునా తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అడ్డుపడి ఇప్పుడు తిరిగి తెలంగాణలోనే రాజకీయాలు చేస్తామంటే, చూస్తూ ఉండటానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని కడియం శ్రీహరి వెల్లడించారు.

Next Story