Kakatiya Medical College : ప్రీతీకి బ్రెయిన్ డ్యామేజ్.. పరిస్థితి విషమం

Kakatiya Medical College : ప్రీతీకి బ్రెయిన్ డ్యామేజ్.. పరిస్థితి విషమం
చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్‌ రేట్‌ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు

వరంగల్‌ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్‌ ప్రీతి ప్రాణాలతో పోరాడుతోంది. ప్రస్తుతం నిమ్స్‌లోని ఏఆర్సీయూలో వెంటిలేటర్‌పైనే ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్‌ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్‌ పద్మజా నేతృత్వంలోని అయిదుగురు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమిస్తుంది.

అనస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్‌ డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ప్రీతి శరీరం సహకరించడం లేదని, బీపీ, పల్స్‌ రేట్‌ నమోదు కానీ పరిస్థితి వచ్చిందన్నారు. వరంగల్‌ నుంచి నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలో రెండుసార్లు గుండె ఆగిపోయిందని.. వైద్యులు సీపీఆర్‌ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారని తెలిపారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమని నిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు.

కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో సీనియర్‌ వేధింపులతోక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story