KALESHWARAM: "కాళేశ్వరం"పై సర్కార్ సంచలన నిర్ణయం

KALESHWARAM: కాళేశ్వరంపై సర్కార్ సంచలన నిర్ణయం
X
మూడు బ్యారేజీలకు మరమ్మతులకు నిర్ణయం.. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డలకు రిపేర్.. పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్ల పిలుపు

కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­లో దె­బ్బ­తి­న్న కీలక బ్యా­రే­జీల పు­న­రు­ద్ధ­రణ పను­ల­ను తె­లం­గాణ ప్ర­భు­త్వం వే­గ­వం­తం చే­సిం­ది. ఈ నే­ప­థ్యం­లో కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్ట్ పై రే­వం­త్ సర్కా­ర్ కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. అన్నా­రం, సుం­ది­ళ్ల, మే­డి­గ­డ్డ బ్యా­రే­జి­ల­ను మర­మ­త్తు చే­యా­ల­ని ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ నే­ప­థ్యం­లో పు­న­రు­ద్ధ­రణ డి­జై­న్ల కోసం టెం­డ­ర్ల­కు ఆహ్వా­నం పలి­కిం­ది. NDSA కమి­టీ దర్యా­ప్తు ఆధా­రం­గా రి­హా­బి­లి­టే­ష­న్‌, రి­పో­ర్టే­ష­న్‌ డి­జై­న్లు చే­య­నుం­ది. డి­జై­న్ల కోసం అక్టో­బ­ర్‌ 15 మధ్యా­హ్నం 3 గంటల వరకు గడు­వు వి­ధిం­చిం­ది. . డి­జై­న్ల తయా­రీ­కి అం­త­ర్జా­తీయ సం­స్థల నుం­చి ఈవోఐ కో­రిం­ది. కాగా బ్యా­రే­జీ­ల­ను మర­మ్మ­తు చే­యా­ల­ని జా­తీయ ఆన­క­ట్టల భద్ర­తా సం­స్థ(ఎన్‌­డీ­ఎ­స్‌ఏ) తన రి­పో­ర్టు­లో పే­ర్కొ­న్న వి­ష­యం తె­లి­సిం­దే. ఆ ని­వే­దిక ఆధా­రం­గా పను­లు మొ­ద­లు పె­ట్టా­ల­ని ప్ర­భు­త్వం సం­క్ప­ల్పిం­చిం­ది. వరదల తర్వాత భూ­భౌ­తిక పరీ­క్ష­లు ని­ర్వ­హిం­చేం­దు­కు ప్ర­ణా­ళిక సి­ద్ధం చే­స్తోం­ది. డి­జై­న్ కన్స­ల్టెం­ట్ ఎం­పిక ప్ర­క్రి­య­ను అధి­కా­రు­లు వే­గ­వం­తం చే­శా­రు. అదే సమ­యం­లో తు­మ్మి­డి­హ­ట్టి వద్ద కూడా బ్యా­రే­జీ ని­ర్మి­స్తా­మ­ని ప్ర­భ­త్వం ఇప్ప­టి­కే ప్ర­క­టిం­చిం­ది. NDSA కమి­టీ దర్యా­ప్తు ఆధా­రం­గా రి­హా­బి­లి­టే­ష­న్‌, రి­పో­ర్టే­ష­న్‌ డి­జై­న్లు రు­పొం­దిం­చా­ల్సి ఉం­టుం­ది.

పనులకు ఆటంకం

ప్ర­స్తు­తం వరదల కా­ర­ణం­గా వర్షా కాలం తర్వాత చే­యా­ల్సిన పరీ­క్ష­ల­కు ఆటం­కం ఏర్ప­డిం­ది. ము­ఖ్యం­గా మే­డి­గ­డ్డ బ్యా­రే­జీ­కి డి­సెం­బ­ర్ లేదా జన­వ­రి వరకు, సుం­ది­ళ్ల, అన్నా­రం బ్యా­రే­జీ­ల­కు నవం­బ­ర్ వరకు వరద ప్ర­వా­హం కొ­న­సా­గే అవ­కా­శం ఉం­ద­ని అధి­కా­రు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. ఈ నే­ప­థ్యం­లో, సమయం వృథా కా­కుం­డా ఉం­డేం­దు­కు ప్ర­భు­త్వం ప్ర­త్యా­మ్నాయ ప్ర­ణా­ళి­క­తో ముం­దు­కె­ళ్తోం­ది. టె­క్ని­క­ల్, ఫై­నా­న్షి­య­ల్ బి­డ్ల ప్ర­క్రియ పూ­ర్త­య్యే­లో­గా మి­గి­లిన పరీ­క్ష­ల­ను పూ­ర్తి చే­యా­ల­ని భా­వి­స్తోం­ది. తద్వా­రా అర్హత సా­ధిం­చిన సం­స్థ­ల­ను సైతం ఈ పరీ­క్షల ప్ర­క్రి­య­లో భా­గ­స్వా­ము­ల­ను చే­యా­ల­ని యో­చి­స్తు­న్న­ట్లు సమా­చా­రం.

కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­ను ని­న్న­మొ­న్న­టి­దాక రా­ష్ట్రా­ని­కి గు­ది­బండ అని..ప్రా­జె­క్టు పే­రు­తో బీ­ఆ­ర్ఎ­స్ పా­ల­కు­లు భా­రీ­గా అవి­నీ­తి­కి పా­ల్ప­డ్డా­ర­ని ఆరో­పిం­చిన కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం..ఇప్పు­డు ప్రా­జె­క్టు పు­న­రు­ద్ద­ర­ణ­కు ని­ర్ణ­యిం­చ­డం చర్చ­నీ­యాం­శ­మైం­ది. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­లో జరి­గిన అవ­క­త­వ­క­ల­పై కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం వి­చా­ర­ణ­కు జస్టి­స్ పీసీ ఘోష్ కమి­ష­న్‌­ను ఏర్పా­టు చే­సిం­ది. కమి­ష­న్ ఇచ్చిన ని­వే­ది­క­ను అసెం­బ్లీ­లో చర్చ­కు పె­ట్టిన సీఎం రే­వం­త్ రె­డ్డి ప్ర­భు­త్వం కే­సు­ను సీ­బీ­ఐ­కి అప్ప­గి­స్తూ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు.

Tags

Next Story