KAVITHA: రామన్న... నాన్న జాగ్రత్త

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హరీశ్‌రావుతో ముప్పు పొంచి ఉందని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు... బీఆర్ఎస్ మంచి కోరుకునే వారు కాదని అన్నారు. ఇప్పుడు నన్ను పార్టీ నుంచి బయటకు పంపారని.. రేపు కేటీఆర్‌కు కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చని అన్నారు. "నాన్న అన్నను కాపాడు" అంటూ కవిత కేసీఆర్‌కు సూచించారు. కేటీఆర్ కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. "రామన్నా.. నాన్న ఆరోగ్యం జాగ్రత్త" అంటూ కవిత హెచ్చరించారు. తన ప్రాణం పోయినా కేటీఆర్, కేసీఆర్‌కు హాని జరగాలని కోరుకోనని స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా కవిత ప్రకటించారు. "బంగారు తెలంగాణ అంటే హరీశ్‌రావు, సంతోష్ ఇళ్లల్లో బంగారం ఉంటే అవుతుందా?సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది." అని కవిత అన్నారు. హరీశ్‌రావు పెద్ద డ్రామా ఆర్టిస్టు అని విమర్శించింది. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు అదనపు ఫండింగ్ ఇచ్చారని ఆరోపించారు. హరీశ్ ట్రబుల్ షూటర్ కాదని... బబుల్ షూటర్ అని అన్నారు. సమస్యను తానే పరిష్కరించినట్లు హరీశ్ డ్రామా చేస్తారని ఆరోపించారు.
బుజ్జగించి అడుగుతున్నా..
" నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా" అని కవిత ప్రశ్నించారు.
హరీశ్‌రావు రేవంత్ కాళ్లు పట్టుకున్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుపై MLC కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో వెళ్లినపుడుతే.. BRS పార్టీపై, KCR ఫ్యామిలీపై కుట్రలు స్టార్ట్ అయ్యాయన్నారు. హరీశ్‌రావు రేవంత్ రెడ్డి కాలు పట్టుకున్నారని, అందుకే ఆయనను కేసుల నుంచి తప్పించి కేసీఆర్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. BRS నుంచి తనను సస్పెండ్ చేయడంపై కవిత స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com