Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ నిలిపివేత..

X
By - Chitralekha |20 Jan 2023 6:16 PM IST
అధికారిక ప్రకటన విడుదల చేసిన మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వెల్లడించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా 45రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
పట్టణ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాలను మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించాయి. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని కైన్సిల్ హామీ ఇచ్చింది. కామారెడ్డి కలెక్టర్, అదనపు కలెక్టర్, కమిషనర్ తో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. రైతుల అభిప్రాయాలు తీసుకుంటామని, ఆ తర్వాతే మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com