Kamareddy : బతుకు భారం.. అమ్మకానికి ఆడశిశువు

కామారెడ్డి జిల్లాలో అమానుషం జరిగింది.బతుకు భారం కావడంతో ఆడశిశువును అమ్మాకానికి పెట్టారు తల్లిదండ్రులు.రామారెడ్డి మండలం స్కూల్ తండాకు చెందిన ఓ గర్భిణీ అన్నారం పీ.హెచ్.సీలో ప్రసవించింది.పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఆశిశువు వారికి భారంగా మారిందో ఏమో లేక మగ సంతానం కావాలనుకున్నారో ఆడపిల్ల పుట్టిన వెంటనే తల్లిదండ్రులు శిశువును అమ్మకానికి పెట్టారు. అయితే మరో మహిళ ఆబిడ్డను అక్కున చేర్చుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు ఆమె వద్దనుంచి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పీహెచ్‌సీ సిబ్బంది పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఐసీడీఎస్ అధికారులు వెంటనే స్కూల్ తండాలో బాలింత ఇంటికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఆడశిశువును వారు ఎందుకు వేరే వారికి అప్పగించారు అనే విషయమై ఆరా తీస్తున్నారు. అయితే బతుకు భారం కావడంతోనే శిశువు అమ్మాకానికి పెట్టినట్లు బాధితులు తెలిపినట్లు సమచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com