KAMAREDDY: రణరంగంగా మారిన కామారెడ్డి

KAMAREDDY: రణరంగంగా మారిన కామారెడ్డి
X
కాం­గ్రె­స్–బీ­జే­పీ నేతల మధ్య సవా­ళ్లతో ఉద్రి­క్త­త

కా­మా­రె­డ్డి­లో రా­జ­కీయ వేడి ఒక్క­సా­రి­గా హై­టె­న్ష­న్‌­గా మా­రిం­ది. అరో­రా కా­లే­జీ భూ­ము­లు, ప్ర­భు­త్వ డి­గ్రీ కా­లే­జీ భూ­ము­లు, శిశు మం­ది­ర్ అం­శా­ల­పై కాం­గ్రె­స్–బీ­జే­పీ నేతల మధ్య కొ­న­సా­గు­తు­న్న ఆరో­ప­ణ­లు, సవా­ళ్లు ఉద్రి­క్త­త­కు దా­రి­తీ­శా­యి. ఈ నే­ప­థ్యం­లో బీ­జే­పీ ఎమ్మె­ల్యే వెం­క­ట­ర­మ­ణా­రె­డ్డి క్యాం­ప్ కా­ర్యా­ల­యం వద్ద ఉద్రి­క్త పరి­స్థి­తు­లు నె­ల­కొ­న­డం జి­ల్లా­లో చర్చ­నీ­యాం­శ­మైం­ది. మాజీ సర్పం­చ్‌, కాం­గ్రె­స్ నా­య­కు­డు గీ­రె­డ్డి మహేం­ద­ర్‌­రె­డ్డి ఎమ్మె­ల్యే ఇంటి ము­ట్ట­డి­కి ప్ర­య­త్నిం­చా­రు. ఎమ్మె­ల్యే­పై వి­మ­ర్శ­లు చే­స్తూ “డౌన్ డౌన్” ని­నా­దా­లు చే­శా­రు. పరి­స్థి­తి అదు­పు తప్పే సూ­చ­న­లు కని­పిం­చ­డం­తో పో­లీ­సు­లు మహేం­ద­ర్‌­రె­డ్డి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. అయి­తే ఘటన అక్క­డి­తో ఆగ­లే­దు. మహేం­ద­ర్‌­రె­డ్డి కా­రు­ను బీ­జే­పీ కా­ర్య­క­ర్త­లు ధ్వం­సం చే­య­డం­తో పరి­స్థి­తి మరింత ఉద్రి­క్త­మైం­ది. అడ్డు­కు­నే ప్ర­య­త్నం చే­సిన పో­లీ­సు­ల­తో కూడా కొం­త­సే­పు వా­గ్వా­దం జరి­గిం­ది.

కారు ధ్వంసంతో ఉద్రిక్తత

కే­వ­లం కా­రు­ను ధ్వం­సం చే­య­డ­మే కా­కుం­డా, దా­ని­కి ని­ప్పు పె­ట్టి­న­ట్లు సమా­చా­రం. దీం­తో ప్రాం­తం­లో తీ­వ్ర ఆం­దో­ళన నె­ల­కొం­ది. వెం­ట­నే రం­గం­లో­కి ది­గిన పో­లీ­సు­లు ఇరు­వ­ర్గా­ల­ను చె­ద­ర­గొ­ట్టి పరి­స్థి­తి­ని అదు­పు­లో­కి తె­చ్చా­రు. మం­ట­ల­ను ఆర్పిం­చి, కా­లి­పో­యిన కా­రు­ను అక్క­డి నుం­చి తర­లిం­చా­రు. ఇక ఈ ఉద్రి­క్త­త­కు మూలం డి­గ్రీ కా­లే­జీ భూ­ముల వి­వా­ద­మే. తనపై కాం­గ్రె­స్ నే­త­లు చే­సిన ఆరో­ప­ణ­ల­కు సా­క్ష్యా­ల­తో చర్చ­కు రా­వా­ల­ని ఎమ్మె­ల్యే కా­టి­ప­ల్లి వెం­క­ట­ర­మ­ణా­రె­డ్డి సవా­ల్ వి­సి­రా­రు. శని­వా­రం ఉదయం 10 గం­ట­ల­కు స్థా­నిక శిశు మం­ది­ర్ వద్ద­కు రా­వా­ల­ని ప్ర­క­టిం­చా­రు. అయి­తే బహి­రంగ చర్చ­కు అను­మ­తి లే­ద­ని పో­లీ­సు­లు స్ప­ష్టం చే­శా­రు. ము­న్సి­ప­ల్ ఎన్ని­కల ఫలి­తాల తర్వాత కా­మా­రె­డ్డి­లో కాం­గ్రె­స్–బీ­జే­పీ నేతల మధ్య వి­మ­ర్శల పరం­పర కొ­న­సా­గు­తోం­ది. తాజా ఘట­న­తో రా­జ­కీయ వా­తా­వ­ర­ణం మరింత ఉద్రి­క్తం­గా మా­రిం­ది. పరి­స్థి­తి­పై పో­లీ­సు­లు నిఘా పెం­చి శాం­తి­భ­ద్ర­త­లు కట్టు­ది­ట్టం చే­శా­రు. డి­గ్రీ కా­లే­జీ భూ­ముల వ్య­వ­హా­రం­లో తనపై చే­సిన ఆరో­ప­ణ­ల­కు చర్చ­కు తాను సి­ద్ధం­గా ఉన్నా­న­ని ఎమ్మె­ల్యే కా­టి­ప­ల్లి వెం­క­ట­ర­మ­ణా­రె­డ్డి అన్నా­రు. తాము కూడా వస్తా­మ­ని కాం­గ్రె­స్ నా­య­కు­లు పే­ర్కొ­న్నా­రు.

Tags

Next Story