తెలంగాణలోని ఆ గ్రామంలో కోళ్లని పెంచడం కానీ,తినడం కానీ చేయరు

తెలంగాణలోని ఆ గ్రామంలో కోళ్లని పెంచడం కానీ,తినడం కానీ చేయరు
నేటి వరకు తమ గ్రామంలో ఏ ఒక్కరు కోళ్లను పెంచరని, కోళ్ల ను తినరని, కోడికూత తమ గ్రామంలో వినిపించదని గ్రామాస్తులు పేర్కొన్నారు.

తెల్లవారు జామున కోడికూతతో ఊరు తెలవారుతుంది. దాదాపు అన్ని గ్రామలలో ఇలానే జరుగుతుంది. కానీ ఆ గ్రామంలో కోడికూత అసలే వినిపించదు. అసలు ఆ గ్రామస్థులు కోళ్లను పెంచరు. మాంసం తినరు. చదవటానికి విచిత్రంగా ఉన్న వింత ఆచారాన్ని తెలంగాణలో పాటిస్తారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి తాండాలోని ప్రజల ఆచారం అది. కంచిరావుపల్లి తాండాలో కోళ్లను పెంచరు, తినరు.

కోళ్లను పెంచ వద్దని చెప్పిన తమ గురువు గారి ఆజ్ఞను,తాత ముత్తాతల కాలం నుంచి తుచ తప్పకుండా నేటికీ కొనసాగిస్తున్నారు.. కంచిరావుపల్లి తాండావాసులు. ఎనిమిది తరాల క్రితం తమ ముత్తాతలకు.. ఊరిలో ఎవ్వరు కోళ్లను పెంచవద్దని, తినవద్దని, గ్రామంలో కోడికూత వినిపించ వద్దని తమ గురువుగారు ఆజ్ఞ ఇవ్వడం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. 'నా ఆజ్ఞను ఎవ్వరైనా అతిక్రమించిన వారికి నా శపం తగులునని' గురువు గారు ఆజ్ఞాపించడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు తమ గ్రామంలో ఏ ఒక్కరు కోళ్లను పెంచరని, కోళ్ల ను తినరని, కోడికూత తమ గ్రామంలో వినిపించదని గ్రామాస్తులు పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story