Karimnagar: కరీంనగర్ ఐటీ టవర్ దీన స్థితి.. పట్టించుకునేవారు లేక..

Karimnagar: కరీంనగర్ ఐటీ టవర్ దీన స్థితి.. పట్టించుకునేవారు లేక..
Karimnagar: విద్యార్థులకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కరీంనగర్‌లో ఐటీ సెంటర్ ఏర్పాటు అయ్యింది.

Karimnagar: ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కరీంనగర్‌లో ఐటీ సెంటర్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.. హైదరాబాద్ తర్వాత ఎ క్లాస్ ఐటీ సెంటర్‌గా పేరు కూడా సంపాదించింది.. ఇంటర్నెట్‌తో పాటు పవర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఆదిలోనే అరిష్టం అన్న చందంగా పరిస్థితి తయారైంది.. మొదటి రెండేళ్లు కొవిడ్ కారణంగా నిరుపయోగంగా ఉండిపోయింది..

ఆ తర్వాత ఐటీ పరిశ్రమలను ఆహ్వానించడంలో నిర్వాహకులు సఫలీకృతం కాలేకపోయారు. దీంతో నిర్వహణ మరింత భారంగా మారింది. ఐటీ టవర్ లో మొత్తం 24 కంపెనీల కోసం ఏర్పాట్లు జరిగాయి.. 3 షిఫ్టుల్లో కలిసి 3600 మందికి ఉపాధి కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం ఒక షిఫ్ట్ లో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 400 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. ఐటీ కంపెనీలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న కంపెనీలపై భారం పడుతుంది.. కంపెనీలను తీసుకురావడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి..

మరోవైపు వరంగల్ లాంటి ఐటీ టవర్ సెంటర్లలో స్క్వేర్ ఫీట్‌కి 11 నుంచి 12 రూపాయలు వెచ్చిస్తుండగా ఏ క్లాస్ వాటికి స్క్వేర్ ఫీట్‌కు 15 రూపాయలు వసూలు చేస్తున్నారు. కరీంనగర్ టవర్ 72 వేల చదరపు అడుగులకుగాను 8 లక్షల రూపాయలు నిర్వహణకు వెచ్చించాల్సి వస్తోంది.. వీటికి తోడు పవర్, ఇంటర్నెట్, లోకల్‌ మెయింటనెన్స్ భారమంతా ప్రస్తుతమున్న కంపెనీల పైన పడుతోంది.. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్‌ రెడ్డి అందిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story