KAVITHA: తెలంగాణ రాజకీయ వేదికపై కొత్త పార్టీ

KAVITHA: తెలంగాణ రాజకీయ వేదికపై కొత్త పార్టీ
X
కొత్త పార్టీ దిశగా దేవనపల్లి కవిత అడుగులు... ప్రధాన అనుచరులతో రహస్య సమావేశం... కొత్తగా పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న చర్చ

బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న నెపంతో కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహరిష్కరించిన మరుసటి రోజే పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. కవిత చేసిన ఈ కీలక ప్రకటనతో 20 ఏండ్లుగా ఆమెకు గులాబీ పార్టీతో ఉన్న అనుబంధం ముగిసింది. ఇక నుంచి ఆమె ఒంటరిగానే పోరాడబోతున్నారు. బీఆర్ఎస్‎కు గుడ్ బై చెప్పిన కవిత కొత్త పార్టీ పెడతారా..? లేదా రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలో జాయిన్ అవుతారా..? అన్న అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన భవిష్యత్ కార్యాచరణపై కవిత కాస్త స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. తనకు ఏ పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. సన్నిహితులు, మేధావులు, జాగృతి కార్యకర్తలతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. కవిత కొత్త పార్టీ ఇదేనని.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

టీబీఆర్ఎస్ పేరుతోనేనా.. ?

తె­లం­గాణ ని­నా­దం­తో ఏర్ప­డిన టీ­ఆ­ర్‌­ఎ­స్‌­లో­ని ‘టీ’ అక్ష­రా­న్ని తొ­ల­గిం­చి బీ­ఆ­ర్‌­ఎ­స్‌­గా మా­ర్చ­డా­న్ని దృ­ష్టి­లో ఉం­చు­కొ­ని.. తాను పె­ట్ట­బో­యే పా­ర్టీ తె­లం­గాణ (టీ)తో మొ­ద­ల­య్యే­లా.. పలు పే­ర్ల­ను పరి­శీ­లి­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. జా­గృ­తి శ్రే­ణు­లు చె­బు­తు­న్న ప్ర­కా­రం.. కవిత పె­ట్ట­ను­న్న పా­ర్టీ పే­రు­ను ‘టీ­బీ­ఆ­ర్‌­ఎ­స్"గా ని­ర్ణ­యి­స్తా­ర­ని, దా­ని­కి పూ­ర్తి­పే­రు ‘తె­లం­గాణ భారత రా­ష్ట్ర సమి­తి’ అని ఉం­డ­వ­చ్చ­నే అభి­ప్రా­యం వ్య­క్త­మ­వు­తోం­ది. లే­దం­టే టీ­బీ­ఆ­ర్‌­ఎ­స్‌ పే­రు­తో­నే ‘తె­లం­గాణ బహు­జన రా­ష్ట్ర­స­మి­తి’ అని ని­ర్ణ­యిం­చే అవ­కా­శా­లు­న్న­ట్లు చె­బు­తు­న్నా­రు. అదీ కా­క­పో­తే.. టీ­ఆ­ర్‌­ఎ­స్‌ పేరు కలి­సొ­చ్చే­లా.. ఇప్ప­టి­కే గు­ర్తిం­పు పొం­ద­ని పా­ర్టీల వి­భా­గం­లో రి­జి­స్ట­ర్‌ అయిన ‘తె­లం­గాణ రా­జ్య సమి­తి’ పా­ర్టీ­ని ఆమె తీ­సు­కుం­టా­ర­ని ప్ర­చా­రం జరు­గు­తోం­ది. ఇప్ప­టి­దా­కా తన ‘తె­లం­గాణ జా­గృ­తి’ సం­స్థ­నే రా­జ­కీయ పా­ర్టీ­గా కవిత మా­రు­స్తా­ర­ని అం­ద­రూ భా­విం­చా­రు. అయి­తే ఉద్యమ సమ­యం­లో స్వ­చ్ఛంద సం­స్థ­గా జా­గృ­తి­ని ఏర్పా­టు చే­సి­నం­దున.. దా­ని­ని అలా­గే కొ­న­సా­గి­స్తూ కొ­త్త­గా పా­ర్టీ పె­ట్టా­ల­ని కవిత భా­వి­స్తు­న్న­ట్లు ఆమె సన్ని­హిత వర్గా­లు చె­బు­తు­న్నా­యి.

పార్టీ నడిపేంత సత్తా కవితకు ఉందా.. ?

అయి­తో కొ­త్త పా­ర్టీ­ని స్థా­పిం­చి నడి­పేంత సత్తా కవి­త­కు ఉందా.? వేరు కుం­ప­టి పె­డి­తే ఏ మే­ర­కు సక్సె­స్ అవు­తా­రు.? గు­లా­బీ పా­ర్టీ­కి ప్ర­త్యా­మ్నా­యం­గా పా­ర్టీ­ని నడి­పిం­చ­గ­ల­రా..? ఇలా ఎన్నో సం­దే­హా­లు రా­జ­కీయ వర్గా­ల్లో తలె­త్తు­తు­న్నా­యి. అయి­తే కవిత కొ­త్త పా­ర్టీ ఏర్పా­టు­కు ఇప్ప­టి­కే గ్రౌం­డ్ వర్క్ సి­ద్ధం చే­సి­న­ట్లు సమా­చా­రం. పా­ర్టీ­లో తనపై జరు­గు­తు­న్న పరి­ణా­మాల నే­ప­థ్యం­లో ఎప్ప­టి నుం­చో ఆమె సొంత పా­ర్టీ మీద గ్రౌం­డ్ వర్క్ ప్రి­పే­ర్ చే­సి­న­ట్టు తె­లి­సిం­ది. ప్ర­స్తుత బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ.. టీ­ఆ­ర్ఎ­స్‌ పే­రు­తో పు­ట్టు­కొ­చ్చిం­ది. ఉద్యమ నే­ప­థ్యం­లో ఏర్పా­టై చి­వ­ర­కు భారత రా­ష్ట్ర సమి­తి­గా రూ­పాం­త­రం చెం­దిం­ది. దాం­తో అప్ప­టి నుం­చి ఆ పా­ర్టీ ప్ర­జ­ల­కు దూరం అయిం­ద­న్న ప్ర­చా­రం ఉంది. దాం­తో మళ్లీ టీ­ఆ­ర్ఎ­స్ పే­రి­ట­నే పా­ర్టీ­ని స్థా­పిం­చి.. ప్ర­జ­ల్లో నాటి సెం­టి­మెం­ట్‌­ను తీ­సు­కొ­చ్చేం­దు­కు కవిత ప్ర­య­త్నా­లు చే­స్తు­న్నా­ర­ని తె­లి­సిం­ది. టీ­ఆ­ర్ఎ­స్ పే­రు­ను తె­స్తే­నే ప్ర­జ­లు అక్కున చే­ర్చు­కుం­టా­ర­న్న ఆలో­చ­న­తో ఆమె ఉన్నా­ర­ని సమా­చా­రం. అం­దు­కే.. టీ­ఆ­ర్ఎ­స్ అక్ష­రా­లు కలి­సే­లా పా­ర్టీ పేరు ఉం­డా­ల­నే ఆలో­చన చే­స్తు­న్న­ట్లు తె­లి­సిం­ది.

జాగృతితోనే ప్రజల్లోకి..

కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి ఆమె తెలంగాణ జాగృతి సంస్థతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకురాకుండా జాగృతి కండువాలతోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే తన జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగారు. అందులో భాగంగానే సంస్థకు సంబంధించి పలు విభాగాలకు కమిటీలను ప్రకటించారు. ముందుగా సింగరేణిపై ప్రత్యేక ఫోకస్ చేసిన ఆమె సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అన్ని ఏరియాలకు ఇన్‌చార్జిలను ప్రకటించారు. అనంతరం హెచ్ఎంఎస్‌తో భాగస్వామ్యం అయ్యారు. ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగానూ నియామకమయ్యారు. వీటి తర్వాత పలు దేశాలకు సంబంధించిన కన్వీనర్లనూ ప్రకటించారు. తాజాగా.. సస్పెన్షన్ నేపథ్యంలో ఇప్పటివరకు కవిత వెంట నడిచిన జాగృతి శ్రేణులు ఇకపై ఆమె బాటలోనే నడుస్తారా? లేక బీఆర్ఎస్ వైపు వెళ్తారా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అంతా కవిత నామాస్మరణే మార్మోగుతోంది. కవిత భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరుగుతోంది.

Tags

Next Story