KAVITHA: బీఆర్ఎస్‌లో కవిత కల్లోలం

KAVITHA: బీఆర్ఎస్‌లో కవిత కల్లోలం
X
శాసన మం­డ­లి­లో ఎమ్మె­ల్సీ కల్వ­కుం­ట్ల కవిత వ్యా­ఖ్య­ల దు­మా­రం

కు­టుం­బాల చు­ట్టూ తి­రి­గే రా­జ­కీయ పా­ర్టీ­ల­కు అం­త­ర్గత వి­భే­దా­లు ఎప్పు­డూ ప్ర­మా­ద­క­ర­మే. ఏపీ­లో షర్మిల జగ­న్‌­కు వ్య­తి­రే­కం­గా తి­రు­గు­బా­టు చే­య­డం వై­సీ­పీ పత­నా­ని­కి పరో­క్షం­గా కా­ర­ణ­మైం­ది. తా­జా­గా తె­లం­గా­ణ­లో కే­సీ­ఆ­ర్‌­కు భి­న్నం­గా కవిత స్పం­దిం­చ­డం.. బీ­ఆ­ర్ఎ­స్‌ భవి­ష్య­త్‌­పై కొ­త్త చర్చ­కు దారి తీ­సిం­ది. అధి­కా­రా­న్ని కో­ల్పో­యిన తర్వాత ఈ అం­త­ర్గత అసం­తృ­ప్తు­లు వ్య­క్త­మ­వ­డం గమ­నా­ర్హం. ఇది పత­న­మా లేక పు­న­ర్ని­ర్మా­ణ­మా అనే­ది వేచి చూ­డా­లి మరి. శాసన మం­డ­లి­లో ఎమ్మె­ల్సీ కల్వ­కుం­ట్ల కవిత వ్యా­ఖ్య­లు దు­మా­రం రే­పు­తు­న్నా­యి. బీ­ఆ­ర్ఎ­స్ పై తీ­వ్ర ఆరో­ప­ణ­లు చే­సిన ఆమె.. కే­సీ­ఆ­ర్ దేశ రా­జ­కీ­యా­ల­పై కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. తె­లం­గా­ణ­లో ఏం పీకి కట్ట­లు కట్టా­మ­ని.. దేశ రా­జ­కీ­యా­లం­టూ కే­సీ­ఆ­ర్‌­ను ఉద్దే­శిం­చి కవిత సూ­టి­గా ప్ర­శ్న­లు సం­ధిం­చా­రు. టీ­ఆ­ర్ఎ­స్ ను బీ­ఆ­ర్ఎ­స్ గా మా­ర్చ­డా­న్ని తాను తీ­వ్రం­గా వ్య­తి­రే­కిం­చి­న­ట్టు చె­ప్పా­రు. కే­సీ­ఆ­ర్ దేశ రా­జ­కీ­యా­ల్లో­కి వె­ళ్లేం­దు­కు తాను ఒప్పు­కో­లే­ద­న్నా­రు కవిత. తె­లం­గా­ణ­లో ఉన్న సమ­స్య­ల­ను .. పను­ల­ను పక్కన పె­ట్టి దేశ రా­జ­కీ­యా­ల­కు వె­ళ్ల­డం ఎం­దు­క­ని ప్ర­శ్నిం­చా­రు.

శాసన మం­డ­లి­లో మా­ట్లా­డిన కవిత… కే­సీ­ఆ­ర్ దేశ రా­జ­కీ­యా­ల్లో­కి వె­ళ్లా­ల­న్న ని­ర్ణ­యా­న్ని తీ­వ్రం­గా తప్పు­బ­ట్టా­రు. “తె­లం­గా­ణ­లో ఏం పీకి కట్ట­లు కట్టా­మ­ని దేశ రా­జ­కీ­యాల గు­రిం­చి మా­ట్లా­డు­తు­న్నా­రు?” అంటూ కే­సీ­ఆ­ర్‌­ను ఉద్దే­శిం­చి సూ­టి­గా ప్ర­శ్న­లు సం­ధిం­చా­రు. రా­ష్ట్రం­లో ఇంకా పరి­ష్కా­రం కాని అనేక సమ­స్య­లు ఉన్నా­య­ని, వా­టి­ని పక్కన పె­ట్టి జా­తీయ రా­జ­కీ­యా­ల­పై దృ­ష్టి పె­ట్ట­డం సరైం­ది కా­ద­ని ఆమె వ్యా­ఖ్యా­నిం­చా­రు. టీ­ఆ­ర్ఎ­స్‌­ను బీ­ఆ­ర్ఎ­స్‌­గా మా­ర్చ­డా­న్ని తాను మొ­ద­టి నుం­చే తీ­వ్రం­గా వ్య­తి­రే­కిం­చా­న­ని వె­ల్ల­డిం­చిన కవిత, ఆ సమ­యం­లో తన అభి­ప్రా­యా­న్ని స్ప­ష్టం­గా చె­ప్పి­నా వి­న­లే­ద­ని ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. తె­లం­గాణ ఉద్య­మం­తో అధి­కా­రం­లో­కి వచ్చిన పా­ర్టీ, ఉద్యమ స్పూ­ర్తి­ని వది­లే­సిం­ద­ని ఆమె ఆరో­పిం­చా­రు. బీ­ఆ­ర్ఎ­స్ హయాం­లో లక్షల కో­ట్ల రూ­పా­య­లు ఖర్చు చే­సి­నా, ఒక్క ఎక­రా­కు కూడా నీరు ఇవ్వ­లే­క­పో­యా­ర­ని కవిత తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు.

రాజకీయ వర్గాల్లో చర్చ

కవిత వ్యా­ఖ్య­లు తె­లం­గాణ రా­జ­కీయ వర్గా­ల్లో వి­స్తృత చర్చ­కు దా­రి­తీ­స్తు­న్నా­యి. బీ­ఆ­ర్ఎ­స్ అం­త­ర్గత వి­భే­దా­లు బహి­రం­గం­గా బయ­ట­ప­డు­తు­న్నా­యా? లేక ఇది కొ­త్త రా­జ­కీయ వ్యూ­హ­మా? అన్న ప్ర­శ్న­లు వి­ని­పి­స్తు­న్నా­యి. ఒక­వై­పు కే­సీ­ఆ­ర్ జా­తీయ రా­జ­కీ­యా­ల­పై దృ­ష్టి పె­ట్టిన సమ­యం­లో, కవిత రా­ష్ట్ర సమ­స్య­ల­పై ఫో­క­స్ పె­ట్ట­డం ప్రా­ధా­న్యత సం­త­రిం­చు­కుం­ది. కవిత చే­సిన వ్యా­ఖ్య­లు బీ­ఆ­ర్ఎ­స్‌­కు రా­జ­కీ­యం­గా ఇబ్బం­ది­క­రం­గా మారే అవ­కా­శా­లు కని­పి­స్తు­న్నా­యి. అదే సమ­యం­లో, తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో కొ­త్త పా­ర్టీ­కి ఎం­త­వ­ర­కు ఆదరణ లభి­స్తుం­ద­న్న­ది వేచి చూ­డా­ల్సిన అంశం. అయి­తే ఒక వి­ష­యం మా­త్రం స్ప­ష్టం. కవిత ప్ర­క­ట­న­తో తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో కొ­త్త అధ్యా­యం మొ­ద­లైం­ది. రా­ను­న్న రో­జు­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ నుం­చి అధి­కా­రిక స్పం­దన ఎలా ఉం­డ­బో­తుం­ది? జా­గృ­తి పా­ర్టీ రా­జ­కీ­యం­గా ఎంత బలం­గా ఎదు­గు­తుం­ది? అన్న­ది రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల­ను ని­ర్ణ­యిం­చే కీలక అం­శా­లు­గా మా­ర­ను­న్నా­యి. బీ­ఆ­ర్ఎ­స్‌­లో మహి­ళ­ల­కు సరైన ప్రా­ధా­న్యం లే­ద­ని కవిత సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. “నా­లాం­టి ఒక­రి­ద్ద­రి­ని మి­న­హా­యి­స్తే, మి­గ­తా మహి­ళ­ల­కు పా­ర్టీ­లో చోటు లేదు” అంటూ ఆమె వ్యా­ఖ్యా­నిం­చా­రు. మహి­ళల కోసం మా­ట్లా­డే పా­ర్టీ­గా చె­ప్పు­కు­నే బీ­ఆ­ర్ఎ­స్, ఆచ­ర­ణ­లో మా­త్రం మహి­ళ­ల­ను పక్కన పె­ట్టిం­ద­ని వి­మ­ర్శిం­చా­రు.

శాసన మం­డ­లి­లో కవిత చే­సిన వ్యా­ఖ్య­లు కే­వ­లం ఒక రా­జ­కీయ వి­మ­ర్శ­గా కా­కుం­డా, తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో కొ­త్త చర్చ­కు తె­ర­తీ­శా­యి. స్వంత పా­ర్టీ­పై­నే బహి­రం­గం­గా అసం­తృ­ప్తి వ్య­క్తం చే­య­డం, కే­సీ­ఆ­ర్ దేశ రా­జ­కీ­యా­ల­పై తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­ల­ను సూ­టి­గా ప్ర­శ్నిం­చ­డం, అం­తే­కా­దు కొ­త్త రా­జ­కీయ పా­ర్టీ ఏర్పా­టు ప్ర­క­టన చే­య­డం ఇవ­న్నీ ఆమె రా­జ­కీయ ప్ర­యా­ణం­లో కీలక మలు­పు­గా భా­విం­చ­బ­డు­తు­న్నా­యి.ఈ పరి­ణా­మా­ల­తో బీ­ఆ­ర్ఎ­స్‌­లో అం­త­ర్గత వి­భే­దా­లు బహి­రం­గ­మ­య్యా­య­న్న అభి­ప్రా­యం వ్య­క్త­మ­వు­తుం­డ­గా, మరో­వై­పు రా­ష్ట్రం­లో కొ­త్త రా­జ­కీయ ప్ర­త్యా­మ్నా­యా­ని­కి అవ­కా­శం ఏర్ప­డు­తోం­ద­న్న చర్చ కూడా మొ­ద­లైం­ది. కవిత ప్ర­స్తా­విం­చిన అవి­నీ­తి ఆరో­ప­ణ­లు, మహి­ళ­లు–ఉద్య­మ­కా­రు­ల­కు పా­ర్టీ­లో చోటు లే­ద­న్న వ్యా­ఖ్య­లు రా­జ­కీ­యం­గా ఎంత ప్ర­భా­వం చూ­పు­తా­య­న్న­ది రా­ను­న్న రో­జు­ల్లో తే­ల­నుం­ది.

Tags

Next Story