KAVITHA:కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు

కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్నారు. కేసీఆర్‌కు రెండు వారాల కిందట లేఖ రాసిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. లేఖ రాయడంలో వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదన్నారు. అది పెద్ద కుట్ర అని.. పార్టీలో ఉన్న కోవర్టుల వల్లనే ఇలా బయటకు వచ్చిందన్నారు. "మా నాయకుడు కేసీఆర్ .. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది’" అని కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ జాగృతి నేతలు ఘన స్వాగతం పలికారు. ‘సీఎం సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎయిర్‌పోర్ట్ బయట మీడియాతో మాట్లాడారు.
కవిత ఏమన్నారంటే...
కేసీఆర్‌కు తాను ఎప్పుడూ లేఖలు రాస్తూంటానని కవిత వెల్లడించారు. పాజిటివ్, నెగటివ్ ఎప్పుడూ లెటర్స్ రాస్తుంటానని తెలిపారు. దాన్ని ఎవరూ లీక్ చేశారో తెలియదని.. కేసీఆర్ కూతుర్ని నా లేఖకే ప్రైవసీ లేదని.. ఎవరు లీక్ చేశారనే విషయం బయటకు రావాలన్నారు. నా లెటర్ పట్టుకుని కాంగ్రేస్, బీజేపీ పండగ చేసుకుంటున్నాయ్..నా నాయకుడు కేసీఆర్ - ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకెళ్తుందిని తెలిపారు. కోవర్టులను పక్కకు జరుపుకుని ముందుకెళ్లాలని సూచించారు.
ఎక్కడా కనిపించిన బీఆర్‌ఎస్ నేతల పేర్లు
కవిత రాక గురించి విస్తృత ప్రచారం జరగడంతో ఎయిర్ పోర్టుకు తెలంగాణ జాగృతికి చెందిన నేతలు తరలి వచ్చారు. ఈ సారి వారు మొత్తం తెలంగాణ జాగృతి రంగు అయిన నీలి రంగు బ్యానర్లను వెంట తెచ్చుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు , ఫోటోలను బ్యానర్ల మీద కనిపించనివ్వలేదు. సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నిస్తున్న కవిత అనే పోస్టర్లు కనిపించాయి.. కవితకు సామాజిక తెలంగాణ పేరుతో స్వాగతం చెప్పడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు.
కొత్త పార్టీపై స్పష్టత ఇవ్వని కవిత
సొంతపార్టీ అంశంపై కవిత స్పష్టత ఇవ్వలేదు కానీ.. పార్టీలో కోవర్టులున్నామని ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పడం వెనుక కవిత అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ చుట్టూ ఉన్న వారు తనను కలవనివ్వకపోవడమో.. లేకపోతే తన గురించి లేనిపోనివి చెప్పి ప్రాధాన్యత లేకుండా చేయడమో చేశారని కవిత భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ దెయ్యాలు ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. కేసీఆర్ చుట్టూ ఉండేవారు అత్యంత సన్నిహితులే అయి ఉంటారు. కేసీఆర్ దగ్గరకు నేరుగా యాక్సెస్ ఉండే లీడర్లు కొంత మంది ఉంటారు. వారిలో కేటీఆర్,హరీష్ రావుతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వంటి వారు ఉంటారు. వీరినే దయ్యాలుగా చెబుతున్నారా అన్న సందేహాలు పార్టీ నేతలు వస్తున్నాయి.
కొత్త పార్టీ దిశగా కవిత అడుగులు..?
"డియర్ డాడీ..." అంటూ కవిత రాసిన లేఖ తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ కేసీఆర్ ను ప్రశ్నించేందుకు.. ఒక మాట అనేందుకే బీఆర్ఎస్ నేతలు భయపడేవారు. అలాంటిది కవిత నేరుగా అధినేతకే లెటర్ రాయడం సంచలనంగా మారింది. అయితే కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని.. అందుకే కేసీఆర్ పై లేఖాస్త్రాన్ని సంధించారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణ జాగృతి పేరుతో కవిత పార్టీ స్థాపించనున్నారని టాక్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com