KAVITHA: కల్వకుంట్ల కుటుంబంలో నలుగురి ఫోన్ ట్యాప్

బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబ్ పేల్చారు. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని తీవ్ర ఆరోపణలు చేశారు. జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన అనంతరం చిట్‌చాట్‌లోనూ సంచలన ఆరోపణలు చేశారు. "ఫామ్‌హజ్ విషయాలన్నీ కాంగ్రెస్‌కు తెలుస్తాయి. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌రావులే ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్‌కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే" అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ గ్యాంగ్ గురించి కేసీఆర్‌కు గతంలో తాను స్వయంగా ఎంతో చెప్పానని.. బీఆర్ఎస్లో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని స్పష్టం చేశారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపైనా పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ‘‘జనగామ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. అందుకే నాకు పల్లా సమాచారం ఇచ్చారు. నా దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్ఎస్ నేతలందరూ ఇబ్బంది పడతారు. నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా అని కవిత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవని.. అలాంటిది ఏమైనా జరిగినా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని కవిత స్పష్టం చేశారు.
చిరు, ప్రభాస్‌లను మోసం చేశారు
మాజీ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు.. చిరంజీవి, ప్రభాస్‌లను మోసం చేశారని కవిత ఆరోపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చిరంజీవి, ప్రభాస్ వంటి సెలెబ్రెట్రీలతో మొక్కలు నాటించి... ఆ ఆడవినే కొట్టేయాలని చూశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. సంతోష్ రావు కూరలో ఉప్పు, చెవిలో జోరీగా లాంటి వారని.. ప్రతీ పనిని చెడగొట్టడంలో ముందు ఉంటాడని విమర్శించారు. "కేసీఆర్ వెంట నీడలా ఉండే సంతోష్‌కు ధనదాహం ఎక్కువ. హరితహారం మాటున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట నకిలీ కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్‌లో నా ఓటమితో ప్రారంభించి.. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి వరకు కుట్ర చేశారు. మాజీ ఎమ్మెల్యేల్లో చాలా మంది సంతోష్ బాధితులు ఉన్నారు. బీఆర్ఎస్ సాఫ్ట్వేర్ అయితే.. జాగృతి హార్డ్‌వేర్. పార్టీకి నా కంట్రిబ్యూషన్ లేదా? కేవలం హరీశ్ రావు, సంతోష్‌ది మాత్రమే ఉందా? మేకవన్నె పులులను పార్టీలో ఉంచుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి.’అని కవిత అన్నారు. హరీశ్ కారణంగానే ఈటల రాజేందర్, జగ్గారెడ్డి మొదలైన వారంతా పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దుబ్బాక, హుజురాబాద్‌లో పార్టీ ఓటమికి ఆయనే కారణం. హరీశ్‌రావు నక్క జిత్తులను గమనించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com