గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరిన కవిత

X
త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వీడియో విడుదల చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఆరేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, 24 గంటల కరెంట్, శాంతిభద్రతలు గొప్పగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇవి ఇలాగే కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల నుంచి ఇండియాలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్ నిలిచిదంటే కేసీఆర్ కష్టం ఎంతో ఉందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
