KAVITHA: రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోదు

KAVITHA: రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే తెలంగాణ జాగృతి ఊరుకోదు
X

తె­లం­గా­ణ­లో జా­గృ­తి ఆధ్వ­ర్యం­లో కొ­త్త నా­య­క­త్వా­న్ని పెం­పొం­దిం­చా­ల­ను­కుం­టు­న్న­ట్లు ఎమ్మె­ల్సీ కవిత పే­ర్కొ­న్నా­రు. తె­లం­గాణ జా­గృ­తి కా­లా­ను­గు­ణం­గా తన పం­థా­ను మా­ర్చు­కుం­ద­ని అన్నా­రు. తె­లం­గాణ జా­గృ­తి ఆధ్వ­ర్యం­లో లీ­డ­ర్ కా­ర్య­క్ర­మా­న్ని ని­ర్వ­హిం­చా­రు. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి హా­జ­రైన కవిత మన సం­ప్ర­దా­యా­లు, కట్టు­బా­ట్ల­పై అవ­గా­హన కల్పిం­చు­కో­వ­డ­మే ము­ఖ్య ఉద్దే­శ­మ­న్నా­రు. ని­త్యం కొ­త్త­గా ఉం­టే­నే సం­స్థ­లు బతు­కు­తా­య­న్నా­రు. పు­ట్టు­క­తో­నే ఎవ్వ­రూ నా­య­క­త్వ లక్ష­ణా­లు అం­దు­కో­ర­ని వా­టి­ని పెం­చు­కుం­టూ ముం­దు­కె­ళ్తే­నే నా­య­కు­డ­వు­తా­డ­న్నా­రు. మూస పద్ధ­తి­లో కొ­న­సా­గే­వా­డు నా­య­కు­డు కా­లే­డ­న్నా­రు.ఎదు­టి­వా­రి­ని తి­డు­తు­న్నా­రం­టే కం­టెం­ట్ లే­న­ట్లు అర్థ­మ­న్నా­రు. మహా­త్మా­గాం­ధీ ఎప్పు­డూ ఎమ్మె­ల్యే­గా­నో, ఎం­పీ­గా­నో లే­ర­ని... అయి­న­ప్ప­టి­కీ ఆయ­న్ని ఇప్ప­టి­కీ గు­ర్తు చే­సు­కుం­టు­న్నా­మ­న్నా­రు. తె­లం­గాణ జా­గృ­తి నుం­చి గాం­ధీ­గి­రీ­కి కొ­త్త భా­ష్యం చె­ప్పా­ల్సిన అవ­స­రం ఉం­ద­న్నా­రు. సాం­స్కృ­తిక నే­ప­థ్యం లే­కుం­డా ఏ జాతీ మను­గడ సా­ధిం­చ­లే­ద­ని పే­ర్కొ­న్నా­రు. సాం­స్కృ­తిక నే­ప­థ్యం లేని జాతి.. పు­నా­ది లే­కుం­డా కట్టిన బి­ల్డిం­గ్‌ లాం­టి­ద­న్నా­రు. తె­లం­గాణ జా­తి­కి అద్భు­త­మైన నే­ప­థ్యం ఉం­ద­ని... దా­ని­ని పరి­ర­క్షిం­చేం­దు­కే జా­గృ­తి పని చే­స్తుం­ద­న్నా­రు.

Tags

Next Story