KAVITHA: కల్వకుంట్ల కవితపై చర్యలకు రంగం సిద్ధం !

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి హీటెక్కాయి. కవిత కామెంట్స్ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఫామ్‌హౌస్‌లో ఉన్న కేటీఆర్.. కవిత ప్రెస్‌మీట్ తర్వాత సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితర నేతలు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకుంటారంటూ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని, ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపంచే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి వరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. అయితే కవితపై బీఆర్ఎస్ వేటు వేస్తే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ గ్రూపు నుంచి కవిత పీఆర్వో అవుట్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ అధిష్టానం షాకిచ్చింది. కాళేశ్వరం అంశంలో పార్టీపై, ఆ పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి ఆమె పీఆర్వో నవీన్ కుమార్‌ను తొలగించింది. పార్టీ గ్రూపులో కవితకు సంబంధించిన అన్ని వార్తలను డిలీట్ చేసింది. కవితపై చర్యలు తీసుకునే అవకాశమూ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగొచ్చని, నష్టం జరిగినా సరే నేను ఇలానే మాట్లాడుతా అంటూ ఆమె ఉద్ఘాటించారు. హరీష్‌రావు, సంతోష్‌రావు దుర్మార్గుల వల్లే ఇదంతా జరిగిందన్నారు.నే కేసీఆర్‌కు ఈ పరిస్థితి వచ్చిందని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఖబడ్దార్ ఎంతవరకు వెళ్లినా నేను తేల్చుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్‌కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు.? అని ఆమె ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది: కాంగ్రెస్
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావును టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. హరీష్‌పై కవిత సంచల వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన అద్దంకి దయాకర్.. ‘ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని స్పష్టమైంది. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోంది. మొన్న కేటీఆర్‌ను టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు హరీష్‌ను టార్గెట్ చేయడం వెనుక ఏదో ఉంది. కేటీఆర్, హరీష్, కవితల మధ్య ఏదో పంచాయితీ ఉంది’ అంటూ అని పేర్కొన్నారు. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది. ఇదంతా హరీష్ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్ మీద విచారణ తర్వాత బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com