KAVITHA: రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా

KAVITHA: రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా
X
నల్లగొండ జిల్లాలో కవిత జన జాగృతి యాత్ర

కి­ష్ట­రాం­ప­ల్లి, నక్క­ల­గం­డి ప్రా­జె­క్ట్ ల భూ ని­ర్వా­సి­తుల గోడు పట్టిం­చు­కో­క­పో­తే సీఎం రే­వం­త్ రె­డ్డి ఇంటి ముం­దు ధర్నా చే­స్తా­మ­ని తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కల్వ­కుం­ట్ల కవిత హె­చ్చ­రిం­చా­రు. సుం­కి­శాల ప్రా­జె­క్టు రి­టై­నిం­గ్ వాల్ కూ­లి­తే నల్గొండ జి­ల్లా­కు చెం­దిన ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి ఇరి­గే­ష­న్ మం­త్రి­గా ఉన్నా, మరో సీ­ని­య­ర్ నేత కో­మ­టి­రె­డ్డి వెం­క­ట్ రె­డ్డి మం­త్రి­గా ఉన్నా పట్టిం­చు­కో­వ­డం లే­ద­ని ధ్వ­జ­మె­త్తా­రు. జా­గృ­తి జనం బాట కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా నల్గొండ జి­ల్లా­లో మా­ట్లా­డిన కవిత.. గతం­లో కే­సీ­ఆ­ర్‍ను లక్ష తి­ట్లు తి­ట్టి అధి­కా­రం­లో­కి వచ్చిన కాం­గ్రె­స్.. ఇప్పు­డు సమ­స్య­ల­పై ఎం­దు­కు పట్టిం­చు­కో­వ­డం లే­ద­ని ని­ల­దీ­శా­రు. నల్ల­గొండ అం­టే­నే పో­రా­టాల పు­రి­టి­గ­డ్డ అని సా­యుధ రై­తాంగ పో­రా­టం­లో.. ఉద్య­మం­లో­నూ ఈ జి­ల్లా కీలక పా­త్ర పో­షిం­చిం­ద­న్నా­రు.

జాగృతికి బీఆర్ఎస్ శత్రువే

అధికారంలో బీఆర్‌ఎస్‌ ఉన్నా, కాంగ్రెస్‌ ఉన్నా ప్రజాసమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెచ్చే బాధ్యతను జాగృతి తీసుకుందని చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, బీఆర్‌ఎస్‌ తప్పులు చేయడం వల్లే ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి తప్పించారని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పని చేయకపోతే ప్రజలు వేరే వారికి అధికారమిస్తారని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలన కలిపి మొత్తం పన్నెండేళ్లలో కృష్ణా జలాలు తెలంగాణకు ఎందుకు తేలేకపోయారో మేధావులు ఆలోచించాలని కోరారు. జాగృతికి బీఆర్ఎస్ దుష్మనే అని స్పష్టం చేశారు.

Tags

Next Story