ఎమ్మెల్సీగా కవిత గెలుపు.. ఉత్సాహంతో మంత్రి నృత్యం

నిజామాబాద్ స్థానిక సంస్థళ కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్‌లోనే కవిత గెలుపు ఖరారైంది. మొత్తం పోలైన ఓట్లు 823 కాగా మొదటి రౌండ్‌లో కవితకు 532 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్‌కు 532, బీజేపీకి 39, కాంగ్రెస్‌కు 22 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి... టీఆర్‌ఎస్ 728, బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు సాధించాయి. మొత్తం 10 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. బీజేపీ, కాంగ్రెస్... డిపాజిట్లు కోల్పోయాయి. అటు... 14న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎమ్మెల్సీగా కవిత గెలుపుతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. కవిత ఇంటి వద్ద ఉత్సాహంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి నృత్యం చేశారు. బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తంచేశారు.
కవిత గెలుపుపై హైదరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. గన్‌పౌండ్రి కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచారు. కవిత ఆధ్వర్యంలో నిజామాబాద్ అభివృద్ధి రెట్టింపు అవుతుందని అన్నారు. ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు మానుకుని... అభివృద్ధికి సహకరించాలని అన్నారు. తనను గెలిపించిన ప్రజాప్రతినిధులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేలతో సమన్వయంతోనే విజయం సాధించామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com