KAVITHA: రాజకీయాల్లో తొక్కుకుంటూ పోవాల్సిందే

కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టత ఇచ్చారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను అని వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని కవిత వెల్లడించారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చి చెప్పారు.
అంతా హరీశే చేశారు
కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారు.. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదు అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేదని అన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు.. నేను కాంగ్రెస్ లో ఎవర్నీ అప్రోచ్ కాలేదుని స్పష్టం చేశారు. :"సీఎం రేవంత్ .. పదే పదే నాపేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు.. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో? అని తెలిపారు. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్న.. బీసీ ఇష్యూ నా మనస్సుకు దగ్గరగా అనిపించిందని తెలిపారు. ప్రస్తుతం ఫ్రీ బర్డ్ .. నా ద్వారాలు తెలిచే ఉన్నాయి.. చాలామంది వచ్చి నన్ను కలుస్తున్నారు.. నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దది" అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ దాడి చేస్తోంది
" నాపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడి చేస్తోంది. బీఆర్ఎస్లో అందరూ నన్ను ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. నా రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చాను. స్పీకర్‌కు ఫోన్ చేసి కూడా ఆమోదించమని అడిగాను. అవసరమైతే మళ్ళీ రాజీనామా లేఖను పంపిస్తాను. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తాను. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే." అని కవిత అన్నారు. "మళ్లీ అధికారంలోకి వచ్చే అర్హత కాంగ్రెస్‌కు లేదు. నాకు కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనే లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. అందరం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలి. బీసీల కోసం కోట్లాడుతున్నాం.. ముందు రిజర్వేషన్లను సాధించుకుందాం. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.’ అని ఘాటు విమర్శలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com