KCR: కేసీఆర్‌కు ఇంగితం లేదు: షర్మిల

74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వైఎస్‌ఆర్‌టీపీ కార్యాలంలో పార్టీ అధినేత షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. గణతంత్ర వేడుకలు జరపకుండా ఆపడం దుర్మార్గపు చర్య అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదన్నారు. అలాంటి పవిత్రమైన రాజ్యాంగాన్ని కేసీఆర్ గౌరవించడంలేదని తెలిపారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గణతంత్ర వేడుకలు కూడా నిర్వహించకుండా నియంతలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తి దేశాన్ని ఏలుతాడట అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిని గౌరవించాలన్న ఇంగితం కూడా కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. గవర్నర్ తమిళిసైకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ సంఘీభావం ప్రకటిస్తుందని వెల్లడించారు. రాజ్యాంగం వల్ల ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణలో ఇలాంటి దుర్ఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపన చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com