KCR: కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే దందా జరుగుతోంది -కేసీఆర్
KCR: తెలంగాణ చాలా రంగాల్లో నెంబర్ వన్‌గా నిలబడిందన్నారు సీఎం కేసీఆర్. అయితే.. రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుండాలన్నారు. ఉండాల్సిన పద్ధతిలో దేశం లేదన్నారు కేసీఆర్. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే దందా జరుగుతోందన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పర్యటించిన ఆయన 4 వేల 427 కోట్ల రూపాయల వ్యయంతో.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. రైతు బంధు, రైతు బీమాపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అడిగారని తెలిపారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నానని.. ఢిల్లీ దాక కొట్లాడి దేశాన్ని బాగుచేసుకోవాలన్నారు. మనం అమెరికాకు వెళ్లడం కాదు.. ఇతర దేశాల నుంచే ఇక్కడికి వచ్చేలా చేసుకోవాలన్నారు కేసీఆర్. బంగారు తెలంగాణలా.. బంగారు భారతదేశం చేసుకోవాలన్నారు.
రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సంగారెడ్డి ప్రాంతంలో తిరిగానన్నారు కేసీఆర్. దీక్ష చేసి చావు అంచుదాకా పోతే తెలంగాణ వచ్చిందన్నారు. బ్రహ్మాండంగా పట్టుపట్టి తెలంగాణ సాధించుకున్నామన్నారు కేసీఆర్. కరెంటే కాదు.. నీళ్ల సమస్యనూ శాశ్వతంగా దూరం చేశామని తెలిపారు. గజ్వేల్, సిద్దిపేట కన్నా అంధోల్ నియోజకవర్గానికి ఎక్కువ నీళ్లు రాబోతున్నాయన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసుకుందామన్నారు. సంగారెడ్డికి 50 కోట్లు, జహీరాబాద్‌కు 50 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాల్టీలకు 25 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో అన్ని తండాలకు రోడ్లు వేయిస్తామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com