KCR: బీజేపీపై ఎదురుదాడి చేయాల్సిందేనని నిర్ణయించిన ఇద్దరు సీఎంలు..

KCR: బీజేపీపై ఎదురుదాడి చేయాల్సిందేనని నిర్ణయించిన ఇద్దరు సీఎంలు..
KCR: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌, హేమంత్‌ సోరెన్‌లు నిర్ణయించారు.

KCR: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక త్వరలోనే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని తెలంగాణ, ఝార్ఖండ్‌ సీఎంలు కేసీఆర్‌, హేమంత్‌ సోరెన్‌లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నచోట అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఇద్దరుూ అభిప్రాయపడినట్లు సమాచారం.

దీనిపై బీజేపీయేతర రాష్ట్రాలు ఏకమై కేంద్రాన్ని ఎదిరించాల్సిందేనని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీల తరఫున అభ్యర్థిని నిలిపి, సత్తా చాటాలని చర్చించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ వచ్చిన ఝార్ఖండ్‌ సీఎం సోరెన్‌... సీఎం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దాదాపు మూడు గంటల పాటు జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, భవిష్యత్తు కార్యాచరణ సహా ఇతర అంశాలపై ఇరువురూ చర్చించారు. కేంద్రంలోని బీజేపీ వైఖరిపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దేశంలోని ఇతర పార్టీలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.

నిధులు, ప్రాజెక్టుల విషయంలోనూ దారుణంగా వివక్ష చూపుతున్నారని, ప్రధాని హోదాను మరిచి రాష్ట్రాలను బద్నాం చేసేందుకు ప్రయత్నించడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ల ద్వారా పెత్తనం చెలాయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story