KCR : 2024 తరువాత ఢిల్లీలో నాన్ బీజేపీ జెండానే ఎగరాలి : కేసీఆర్

KCR : 2024 తరువాత ఢిల్లీలో నాన్ బీజేపీ జెండానే ఎగరాలి : కేసీఆర్
KCR : జాతీయ రాజకీయాలపై నిజామాబాద్‌ పర్యటనలో కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌

KCR : జాతీయ రాజకీయాలపై నిజామాబాద్‌ పర్యటనలో కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 2024 తర్వాత ఢిల్లీలో నాన్-బీజేపీ జెండానే ఎగరాలన్నారు.

దేశరాజకీయాల్లోకి రావాలని రైతు నాయకులు తనను కోరారని...త్వరలోనే జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. MLAలను సంతల్లో పశువుల్లాగా కొంటూ.. ప్రభుత్వాలను పడగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ముక్త్ భారత్ ఎజెండాతో ముందుకు సాగుతానని ప్రకటన చేశారు.

రైతుల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తోందన్నారు కేసీఆర్‌. ఎరువుల ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం NPAల పేరిట బడా వ్యాపారులకు 12 లక్షల కోట్ల దోచి పెట్టిందన్నారు.

లక్షా 20 వేల కోట్లు మాత్రమే ఖర్చయ్యే ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని మోదీ చెప్తున్నారన్నారు కేసీఆర్‌. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ పోతున్నారని ఆరోపించారు. 8 ఏళ్లలో ఏ ఒక్క పరిశ్రమను గానీ, ప్రాజెక్టును గానీ మోదీ సర్కార్ నిర్మించలేదన్నారు కేసీఆర్.

నిజామాబాద్ కలెక్టరేట్‌ ఆఫీసును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్ బైపాస్‌ రోడ్డులో 25 ఎకరాల విస్తీర్ణంలో 60 కోట్ల వ్యయంతో కలెక్టరేట్‌ను నిర్మించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కలెక్టర్‌ నారాయణ రెడ్డిని సీటులో కూర్చొబెట్టారు కేసీఆర్. అటు నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును సైతం కేసీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు MLA జీవన్ రెడ్డిని సీటులో కూర్చొబెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story