KCR BRS Party : ఇక నుంచి 'బీఆర్ఎస్‌'గా టీఆర్ఎస్.. మొదటి పోటీ మునుగోడు నుంచే..

KCR BRS Party : ఇక నుంచి బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్.. మొదటి పోటీ మునుగోడు నుంచే..
KCR BRS Party : టీఆర్‌ఎస్‌ కనుమరుగైంది. తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో భారత్ రాష్ట్ర సమితి పుట్టుకొచ్చింది

KCR BRS Party : టీఆర్‌ఎస్‌ కనుమరుగైంది. తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో భారత్ రాష్ట్ర సమితి పుట్టుకొచ్చింది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో టీఆర్‌ఎస్ స్థానంలో బీఆర్‌ఎస్ వచ్చింది. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటిస్తూ తీర్మానాన్ని చదివి వినిపించారు సీఎం కేసీఆర్. టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా సంతకాలు చేసి ఆమోదించిన పార్టీ మార్పు తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

ఈ ప్రక్రియతో టీఆర్‌ఎస్ కాస్తా భారత్‌ రాష్ట్ర సమితిగా సరికొత్త జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. సాయంత్రం నాలుగు గంటలకు భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావంపైనా, విధివిధానాలపైనా మీడియాతో పంచుకోబోతున్నారు సీఎం కేసీఆర్.

ఇప్పటికే, సర్వసభ్య సమావేశంలో బీఆర్‌ఎస్‌ విధివిధానాలేంటి, అజెండా ఏంటన్న దానిపై సభ్యులకు వివరించారు సీఎం కేసీఆర్. భారత్‌ రాష్ట్ర సమితిని ఏర్పాటును సీఎం కేసీఆర్ ప్రకటించగానే.. తెలంగాణ భవన్ ఎదుట భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. హైదరాబాద్‌తో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ సంబురాలు జరుగుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ పేరు మార్పు అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నారు గులాబీ నేతలు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి లేఖ కూడా రాశారు. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చామని, ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలోనూ మార్పులు చేశామని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో వివరించారు. పార్టీ నేతలు చేసిన తీర్మానం, ఇతర పత్రాలను రేపు కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా వెళ్లి సమర్పించబోతున్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, తెలంగాణ భవన్‌ కార్యాలయ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రెడ్డి తీర్మానం కాపీతో రేపు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ జనరల్‌ బాడీ మీటింగ్‌లో ఆమోదించిన తీర్మానానికి ఆమోదం తెలపాలని కోరుతూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి వినోద్‌కుమార్ అఫిడవిట్‌ ఇవ్వనున్నారు.

టీఆర్‌ఎస్‌ నేతలు సమర్పించే అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించి నోటిఫికేషన్‌ ఇవ్వనుంది కేంద్ర ఎన్నికల సంఘం. పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు నెల రోజుల గడువు ఇస్తుంది. ఈ నెల రోజుల్లో అభ్యంతరాలేం రాకపోతే బీఆర్‌ఎస్‌ పేరుకు ఈసీ ఆమోదం తెలపనుంది.

Tags

Read MoreRead Less
Next Story