KCR : కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన.. ఆరోజేనా..?

KCR : కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.... పార్టీ ప్రకటన ముహూర్తాన్ని ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దసరారోజే పార్టీని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో.. సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా.. దసరాకే కొత్త జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం జాతీయ పార్టీ జెండా, ఎజెండా, పేరు సంబంధిత అంశాలపై, టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చడంలో ఎదురయ్యే సాంకేతిక అవరోధాలపై లోతుగా చర్చిస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులు, అనుసరించాల్సిన ప్రణాళిక తదితరాలపైనా ఆయా రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు కొనసాగుతున్నాయి.
కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో చేర్చే ప్రతి అంశాన్నీ ఆచరణ సాధ్యం చేసేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికలను కూడా వివరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులు, గతంలో ఎన్నికల సంఘంలో పనిచేసిన కొందరు కీలక అధికారులతో కూడిన బృందం సలహాలు కూడా తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com