KCR : ఆబిడ్స్ లో జాతీయ గీతాలాపన చేసిన సీఎం కేసీఆర్..

KCR Geethalapana : హైదరాబాద్ అబిడ్స్ జీపీవో జంక్షన్ వద్ద జాతీయ గీతాలాపన చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ నగరంలోని అన్ని కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్స్ వేసి, నిమిషం పాటు వాహనాలు ఆపి, ఎక్కడి వాళ్లు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సరిగ్గా పదకొండున్నర గంటలకు ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. అన్ని కూడళ్ల వద్ద ఉద్యోగులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు జాతీయ గీతం పాడారు.
అబిడ్స్ వద్ద సీఎం కేసీఆర్, ప్యాట్నీ సిగ్నల్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపనకు మంత్రి తలసాని, ఉప్పల్‌లో జాతీయ గీతాలాపనకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. కేవలం జంక్షన్ల వద్ద మాత్రమే కాదు.. అదే సమయానికి మెట్రో రైళ్లు, స్టేషన్లలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. మెట్రో రైళ్లను సైతం నిమిషం పాటు
తెలంగాణలోని అన్ని ప్రాంతాలు, అన్ని కూడళ్లలో జనగణమన గీతం మారుమోగిపోయింది. దేశానికి సాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా యావత్ దేశం వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com