KCR: ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. అకస్మాత్తుగా తిరుగు ప్రయాణం..
KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటను అకస్మాత్తుగా ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండాల్సింది. అటు తర్వాత బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా పర్యటన ముగించుకుని కేసీఆర్ హైదరాబాద్ బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీ అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు, గాల్వన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్‌లతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించారు. రాజకీయ నాయకులను కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుకుంటారని కేసీఆరే స్వయంగా చెప్పడం ఆయన ఢిల్లీ టూర్ వెనక పక్కా పొలిటికల్ ఎజెండా ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే కేసీఆర్‌తో రాజకీయ చర్చలపై అటు కేజ్రీవాల్ కానీ ఇటు అఖిలేశ్ కానీ నోరు మెదపలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com