KCR: కేంద్రం వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం..

KCR: కేంద్రం వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం..
X
KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం ముగిసింది.

KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం ముగిసింది. మంత్రులు, ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు బయల్దేరారు. అటు ఈ నెల 21న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో ఉదయం 11.30 కు ఈ సమావేశం జరగనుంది.

యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా..పోరాటానికి కేసీఆర్ రూపకల్పన చేయనున్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసి... యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ బృందం డిమాండ్ చేయనుంది.పార్లమెంట్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. పంజాబ్‌ తరహాలో తెలంగాణలో కూడా...వరి ధాన్యాన్ని 100శాతం ఎఫ్‌సీఐ సేకరించాలని డిమాండ్‌ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

Tags

Next Story