KCR CUP 2023: వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌ విడుదల

KCR CUP 2023: వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌ విడుదల
ఫిబ్రవరి 15, 16 తేదీల్లో లాల్‌బహదూర్‌ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో వాలీబాల్‌ పోటీలు

ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే కేసీఆర్‌ కప్‌-2023 రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో లాల్‌బహదూర్‌ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫి మెడల్స్ అందిస్తామని కవిత తెలిపారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 75 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 50 వేలు అందిస్తామన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ పుట్టిన రోజున దళిత, క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న దళిత, క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్‌ను కూడా కవిత రిలీజ్‌ చేశారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

Tags

Next Story