ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం ఢిల్లీ నుంచి హైదరబాద్‌కు బయలుదేరారు. శనివారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఏకాంతంగా చర్చించారు సీఎం కేసీఆర్.
ముఖ్యంగా తెలంగాణకు వరద సాయం చేయాలని మోదీతో పాటు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు నీతి అయోగ్ సూచించిన 24 వేల కోట్లు మంజూరులో సహకరించాలని కోరారు. ఇక పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలను కూడా చెల్లించాని కోరారు. అలాగే రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేటాయించాలని విన్నవించారు సీఎం కేసీఆర్. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిసిన ఆయన... సిద్ధిపేట సహా ఆరు చోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com