KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ.. ప్రధాని అపాయింట్‌మెంట్ గురించి అంతటా చర్చ..
KCR Delhi Tour (tv5news.in)
KCR Delhi Tour: వరి కొనుగోలు పంచాయితీ ఢిల్లీకి చేరింది. దాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరి ఏంటో తేల్చుకునేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారు. ఏ పంట వేయాలి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత రైతులకు చెబుతామని సీఎం అన్నారు. రైతు సమస్యలు ఓ కొలిక్కి వచ్చే వరకు పోరాడుతామని ప్రకటించిన సీఎం.. యాసంగి పంట కొనుగోలు పై అమీతుమీ తేల్చుకుంటామన్నారు సీఎం .
యాసంగి పంట కొనుగోలు పై కేంద్రం స్పష్టత ఇచ్చేవరకు వదలమని ప్రకటించిన సీఎం ఢిల్లీకి వెళ్లారు. ప్రధానితో పాటు కేంద్ర పెద్దలను కలిసి వరి కొనుగోలు పై తమ క్లారిటీ ఇవ్వాలని అడగను ఉన్నారు. ఇప్పటికే ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్ .. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు . ధాన్యం కొనుగోలు పై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి సమాధానం రాలేదు.
అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించిన విధంగానే.. తెలంగాణ నుంచి ప్రతి ఏటా కొనుగోలు చేసింది కాబట్టి.. ఏడాదికి టార్గెట్ ఇవ్వండని కేంద్రాన్ని కోరనున్నారు. కేంద్రం ఇచ్చే సూచనల మేరకు తెలంగాణ రైతాంగానికి ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉంటుందని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. వరి కొనుగోలు పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ 100 నియోజకవర్గాల్లో ధర్నాలతోపాటు.. ఈనెల 18వ తేదీన సీఎంతో సహా ప్రజాప్రతినిధులంతా ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు.
అదే సమయంలో కేంద్రం నుంచి అనధికారికంగా కొన్ని లీకులు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. వరి కొనుగోలు పై కేంద్రం ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని సీఎం కెసిఆర్ నేతృత్వంలో మంత్రులు అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటివరకు కేంద్ర పెద్దలు ఒక మాట.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు మరో మాట చెప్పి వరి కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టింది సీఎం ఆరోపించారు.
వానకాలం పంట చివరి గింజ వరకు తాము కొనుగోలు చేస్తున్నామని.. ఇందుకు సంబంధించి చి 6,600 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక యాసంగి పంట పై కేంద్రమే తుది నిర్ణయం చెప్పాలని టిఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ పండించే పంట ను కేంద్రం కొనుగోలు చేస్తుందని .. తెలంగాణలో యాసంగి పంట ఎందుకు కేంద్రం కొనటం లేదని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో తమ నిరసన గళం వినిపించిన టిఆర్ఎస్ ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com