KCR : పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చి రేగే తెలంగాణ కావాలా : కేసీఆర్

KCR : పంటలు పండే తెలంగాణ కావాలా.. మత పిచ్చి రేగే తెలంగాణ కావాలా : కేసీఆర్
KCR : పంటలు పండే తెలంగాణ కావాలా? మత మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.

KCR : పంటలు పండే తెలంగాణ కావాలా? మత మత పిచ్చితో మంటలు రేగే తెలంగాణ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, జిల్లా టీఆర్ఎస్ ఆఫీస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం కేసీఆర్.. బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎనిమిదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. స్వార్థపరులు, నీచ మత పిచ్చిగాళ్లను తరిమికొట్టాలన్నారు. ఒకసారి దెబ్బతింటే వందేళ్లు నష్టపోతామని స్పష్టంచేశారు. తన బలం, బలగం ప్రజలే అన్న సీఎం కేసీఆర్.. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను ఆగం కానివ్వనని తేల్చి చెప్పారు.

ఇక కేంద్ర బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. భారతదేశంలో అప్రజాస్వామిక వాతావరణం నెలకొందని ఆరోపించారు. ప్రధాని మోదీ కుట్రలు పన్ని దేశంలోని 9 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాల కోసం మహారాష్ట్ర, బీహార్‌లో బీజేపీ ఏంచేసిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లోనూ ప్రభుత్వాలను కూల్చేస్తామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ చేస్తున్నది ప్రజాస్వామ్యమా? రాజకీయమా.. అరాచకత్వమా? అనేది సమాధానం చెప్పాలన్నారు సీఎం కేసీఆర్.

ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ.. తాను సీఎం అయినప్పుడే మోదీ కూడా ప్రధాని అయ్యారని గుర్తుచేసిన కేసీఆర్.. దేశంలో ఏమైనా ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 24 గంటటూ కరెంట్ ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ ఉండదన్నారు. బీజేపీ అరాచకాలను మౌనంగా భరిద్దామా.. లేకుంటే పిడికిలి బిగించి పోరాటం చేద్దామా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story