KCR: కాళేశ్వరంపై కాంగ్రెస్‌వి రాజకీయాలు

KCR: కాళేశ్వరంపై కాంగ్రెస్‌వి రాజకీయాలు
కృష్ణా జిల్లాలో వాటా సాధించాలని సవాల్‌.... న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం త్పపదన్న కేసీఆర్‌

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సాధించుకోవడమే లక్ష్యమంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న పార్టీ అధినేత KCR కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ప్రత్యేక బస్సుల్లో నల్గొండ సభకు తరలివెళ్లగా, హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్న కేసీఆర్‌... కృష్ణా జలాలపై తెలంగాణ ప్రజల హక్కులను కేంద్రానికి అప్పగించిందంటూ కాంగ్రెస్‌ సర్కార్‌పై మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదని తెలిపారు.బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌పై ఒత్తిడి తెచ్చి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించాలని డిమాండ్‌ చేశారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే నల్గొండ సభ నిర్వహించినట్లు స్పష్టం చేశారు.


కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కే వరకూ... పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకోసం... అలుపెరుగని పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. కృష్ణా ప్రాజెక్టులను... బోర్డుకు అప్పగించబోమనితీర్మానంతోపాటు అఖిలపక్షాన్ని...ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డబ్యారేజీ విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్న KCR...... దమ్ముంటే కాపర్ డ్యాంద్వారా రైతులకు నీళ్లివ్వాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనను బద్నాం చేసేందుకే మేడిగడ్డకు..... ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లారని మండిపడిన కేసీఆర్‌......అందుకోసం రైతుల పొలాలు ఎండపెడతారా అని విమర్శించారు. మేడిగడ్డలో పిల్లల్లు కుంగడం..... పెద్ద విషయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ప్రజలు తమకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారన్న KCR.. గతంలో మాదిరిగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని కేసీఆర్‌ స్పష్టం చేశారు . కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు.


బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యింది, దిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్‌ ముందు పోరాడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా.. పిల్లి మాదిరిగా ఉండను.

Tags

Read MoreRead Less
Next Story