KCR: ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా.. 24 గంటల డెడ్ లైన్ విధించిన కేసీఆర్

KCR: ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా.. 24 గంటల డెడ్ లైన్ విధించిన కేసీఆర్
KCR: ఢిల్లీ దీక్షలో కేసీఆర్ కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించాలన్నారు.

KCR:ఢిల్లీ దీక్షలో సీఎం కేసీఆర్ కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించాలని లేదంటే తామే నిర్ణయం తీసుకుంటామన్నారు. దండం పెట్టి చెపుతున్నా రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఢిల్లీ రైతు దీక్షలో మాట్లాడిన కేసీఆర్.. రైతుల సమస్యపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామన్నారు. ధాన్యం కొనకుంటే ఆఖరి నిర్ణయం మేమే తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామన్నారు.

దేశప్రధాని నరేంద్రమోదీ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు సీఎం కేసీఆర్. దేశంలోని రైతులు బీదవాళ్లుకాదని.. .. బిక్షం అడగడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అన్నదాతలకోసం కొత్త వ్యవసాయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.లేదంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి.. కొత్త ప్రభుత్వంలో సాధించుకుంటామని హెచ్చరించారు.

రైతులను ఏడిపించిన రాజ్యం ఏనాడు బాగుపడలేదన్నారు కేసీఆర్. ధాన్యం కొనమంటే పియూష్‌ గోయల్ నూకలు తినమంటారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశానికి కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తేనే మోదీకి రైతులు గుర్తుకు వస్తారన్నని ఎద్దేవా చేశారు. సమైక్యపాలనలో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులకు పడ్డారని కేసీఆర్ గుర్తుచేశారు. దేశంలో 24గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story