తెలంగాణ

KCR: యాదాద్రిలో కేసీఆర్ దంపతులు.. రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం..

KCR: యాదాద్రిలో శివాలయం ఉద్ఘాటన క్రతువులో భాగంగా గర్భాలయంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్ దంపతులు.

KCR: యాదాద్రిలో కేసీఆర్ దంపతులు.. రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం..
X

KCR: యాదాద్రిలో శివాలయం ఉద్ఘాటన క్రతువులో భాగంగా గర్భాలయంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్ దంపతులు. పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాటన పర్వాలు జరిగాయి. ఉద్ఘాటన క్రతువు తరువాత ఆలయ మండపంలో అర్చకులు సీఎం కేసీఆర్‌కు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు.

యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగానే ఈ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. గుట్టపై పునర్‌నిర్మాణ పనుల్లో భాగంగా ఈ ఆలయాన్నీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 20న మొదలైన మహా కుంభాభిషేక మహోత్సవం ఇవాళ పూర్ణాహుతితో ముగిసింది. శైవాగమ శాస్త్రోక్తంగా ఈ ఘట్టాలన్నింటినీ పూర్తి చేశారు. అటు.. యాదాద్రి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES