KCR Bihar : బిహార్‌లో సీఎం కేసీఆర్.. అమరుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేేత

KCR Bihar : బీహార్‌లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్.. గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం చేశారు. బిహార్ సీఎం నితిశ్ కుమార్‌తో కలిసి బాధితులకు చెక్కులు అందజేశారు. సికింద్రాబాద్ టింబర్ డిపోలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక కుటుంబాలకు సైతం తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. బాధిక కార్మికు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున అందజేశారు.
గాల్వాన్‌లో సైనికుల త్యాగం ఎంతో గొప్పదని సీఎం కేసీఆర్ కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలకు సాయం చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో బీహార్ కార్మికుల పాత్ర కూడా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
కరోనా సమయంలో చాలా మంది బీహార్ కార్మికులు తెలంగాణలో ఉండిపోయారని.. వారిని ప్రత్యేక రైళ్లల్లో తరలించామన్నారు. గోదావరి తీరం నుంచి నేను గంగా తీరానికి వచ్చానన్నారు. ఈ సాయం మీ వరకు అందడానికి సాయపడ్డ నితీష్ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ నుంచి ఎప్పుడైతే విప్లవం వచ్చిందో అప్పుడే దేశంలో శాంతి నెలకొందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com