KCR: నీచరాజకీయాల కోసం దిగజారే వారు ఎప్పుడూ ఉంటారు: కేసీఆర్

KCR: నీచరాజకీయాల కోసం దిగజారే వారు ఎప్పుడూ ఉంటారు: కేసీఆర్
KCR: జాతీయ రాజకీయాలపై మరోసారి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.

KCR: జాతీయ రాజకీయాలపై మరోసారి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే కుట్ర జరుగుతోందంటూ పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. నీచరాజకీయాల కోసం దిగజారే వారు ఎపుడూ ఉంటారని.. ఒక్కసారి దెబ్బతింటే మళ్లీ ఏకం కావడం కష్టమని హితవు పలికారు. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అక్కడ జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.

తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని.. జాతీయ రాజకీయాల్లో ఏం జరుగుతుందో గమనించాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై కొందరు పనికిమాలని విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కరెంట్ కష్టాలే లేవన్నారు. దేశరాజధాని ఢిల్లీలో సైతం 24గంటలు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని.. కానీ మన హైదరాబాద్‌లో అసలు పవర్‌ కట్టే ఉండదని చెప్పుకొచ్చారు. ఇక దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు అధిక జీతాలు ఇస్తున్నామన్నారు. ఏపీలోనే ఉంటే ఈ సంక్షేమం అందేదా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

మధ్యాహ్నం ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ అంతాయిపల్లి చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కార్యాలయంలో కలెక్టర్‌ ఎస్ హరీష్‌ను కూర్చొబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ మండలం అంతాయిపల్లిలో కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. 30ఎకరాల స్థలంలో 56 కోట్ల 20 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించారు.

Tags

Read MoreRead Less
Next Story