Police Command Control Centre: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

Police Command Control Centre: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..
Police Command Control Centre: సైబర్‌ క్రైమ్‌ అనేది చాలా క్రిటికల్‌గా మారిందన్నారు సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌.

Police Command Control Centre: సైబర్‌ క్రైమ్‌ అనేది చాలా క్రిటికల్‌గా మారిందన్నారు సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌. బంజారాహిల్స్ రోడ్‌ నంబరు 12లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సర్వమత ప్రార్థనల అనంతరం టవర్‌-Aలోని సీపీ సీవీ ఆనంద్‌ ఛాంబర్‌ను ఆయన ప్రారంభించారు. టవర్‌ -Dలోని పోలీస్‌ మ్యూజియంతో పాటు పలు విభాగాలను సందర్శించి.. వాటి పనితీరును పరిశీలించారు.

సమాజం కోసం పోలీసులు పాటుపడటం అభినందనీయమన్నారు సీఎం కేసీఆర్‌. ఎప్పటికప్పుడు పోలీస్‌ శాఖ అప్‌డేట్‌ కావడం అవసరమన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఆలోచన డీజీపీదేనని.. ఈ నిర్మాణం సంతృప్తినిచ్చిందన్నారు. రిటైర్డ్‌ పోలీసుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇక సైబర్‌ క్రైమ్‌ మీద ప్రత్యేకంగా పని చేయాలని సూచించారు సీఎం కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story