TRSLP Meeting: మీటింగ్‌లో కేసీఆర్ సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు..

TRSLP Meeting: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎల్పీ మొదటి విడత సమావేశం ముగిసింది. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి సమావేశం జరగనుంది. కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా, నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 25 తర్వాత రైతు ఉద్యమానికి సిద్ధంగా ఉంటాని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. అలాగే రైతుల సమస్యలపై టీఆర్‌ఎస్ ఎంపీలంతా పార్లమెంట్‌లో పోరాడాలని సూచించారు. కేవరం పార్టీ కార్యకర్తలే కాకుండా... అంతా కలిసి పోరాడాలన్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి.... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు సహా... మొత్తం 300 మందికిపైగా హాజరయ్యారు. ఒక్క వరి మాత్రమే కాకుండా... రైతు వేసే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలలని... కేంద్రమే పంటలు కోవాలన్నారు సీఎం కేసీఆర్. అలాగే ది కాశ్మీర్ ఫైల్ సినిమాపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈ సినిమాను రిలీజ్ చేశారని ఆరోపించారు. ఇక ఈనెల 28న అందరూ యాదాద్రికి రావాలని పిలుపునిచ్చారు.
లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి భేటీ అయ్యి... కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా యాసంగి వరి ధాన్యం కొనుగోలుపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిపక్షాల విమర్శలు ఎలా తిప్పికొట్టాలి..? కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లన్నున్నారు సీఎం కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com