KCR: రాష్ట్రపతి ఎన్నికలే కేసీఆర్ ప్రధాన టార్గెట్.. జాతీయ పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

KCR: రాష్ట్రపతి ఎన్నికలే కేసీఆర్ ప్రధాన టార్గెట్.. జాతీయ పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?
KCR: జాతీయ పార్టీ ప్రకటనపై కసరత్తు చేస్తున్న కేసీఆర్సమావేశానికి హాజరవ్వాలా వద్దా అనే అంశంపై సీనియర్లతో చర్చించారు.

KCR: జాతీయ పార్టీ ప్రకటన..విధి విధానాల పైన కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవ్వాలా వద్దా అనే అంశం పైన పార్టీ సీనియర్లతో సుదీర్ఘంగా చర్చించారు. తొలి నుంచి బీజేపీ..కాంగ్రెస్ కు సమ దూరం పాటించాలనే ఆలోచన విషయంలో కేసీఆర్ అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. మమాతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్​ను ఆహ్వానించడంతో ఈ సమావేశానికి దూరంగా ఉండాలని తుది నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయంగా క్రియా శీలకంగా వ్యవహరించాలనే లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్ అటు బీజేపీ..ఇటు కాంగ్రెస్ తో సంబంధం లేని పార్టీలు సత్సంబంధాలు కోరుకుంటున్నారు.

దీంతో..ఇప్పుడు కాంగ్రెస్ హాజరయ్యే సమావేశంలో తాము పాల్గొనటం ద్వారా పార్టీ ఏర్పాటు సమయంలో విమర్శలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ బృందాన్ని పంపాలని తొలుత భావించినా సుదీర్ఘ మంతనాల తర్వాత మొత్తానికే దూరంగా ఉండాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమతా బెనర్జీ ఈ సమావేశం ఏర్పాటు చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ - బీజేపీకి టీఆర్ఎస్ సమదూరం పాటిస్తోంది.

కాంగ్రెస్ తో సంబంధం లేకుండా సమావేశం నిర్వహించాలని మమతను సైతం కోరినట్లుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ సైతం ప్రతిపక్షం కావటంతో.. బీజేపీ పైన పోరాటం ప్రారంభించిన నాటి నుంచీ..కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్య పొత్తు అనే అంశాన్ని బీజేపీ నేతలు టీఆర్ఎస్ పైన విమర్శల కోసం అస్త్రంగా మలచుకొనే ప్రయత్నం చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి సమావేశంలో పాల్గొనటం ద్వారా తెలంగాణతో పాటుగా జాతీయ పార్టీ పైన ప్రభావం పడుతుందనే అంచనాకు వచ్చారు.

పార్టీ నేతల సమావేశంలో మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని వివరించిన సీఎం కేసీఆర్.. ఆ సమయంలోనే తాను రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కోరానని పార్టీ నేతలకు సీఎం వివరించినట్లు తెలిసింది. విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఖరారయ్యాక తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఆలోచన. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై విమర్శలకు విపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని కేసీఆర్ ప్లాన్ అంటున్నారు గులాబీ శ్రేణులు.

Tags

Read MoreRead Less
Next Story