KCR: అసెంబ్లీకి అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయిన కేసీఆర్

KCR: అసెంబ్లీకి అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయిన కేసీఆర్
X
సంతాప తీర్మానాల అనంతరం వెళ్లిపోయిన గులాబీ దళపతి

తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే సభకు వచ్చిన మూడు నిమిషాలకే కేసీఆర్ వెళ్లిపోయారు. కనీసం దివంగత సభ్యుల సంతాప తీర్మానం వినకుండా జాతీయ గీతం అవ్వగానే సభను వీడారు. జనగణమన గీతాలాపన తో సమావేశాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. దివంగత సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్.. తుంగుతుర్తి, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్​రెడ్డి, చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలపారు. అనంతరం జిరో అవర్ భాగంగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతిలో తెలంగాణ భక్తులు ఇబ్బంది పడుతున్నారని, వసతి విషయంలో ప్రభుత్వ దృష్టి సారించాలని, వివిధ రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ భవన్ ను తిరుమలలో కట్టాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని సూచించారు.

షేక్ హ్యాండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. వ్యక్తిగతంగా ఒకరిని మరొకరు ఏకిపారేసుకుంటున్నారు. అయితే, తెలంగాణ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్‌ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇటు, కేసీఆర్ మూడు నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది.

Tags

Next Story